ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ పేరు వింటే చాలు ప‌వ‌న్ ఫ్యాన్స్‌కే కాదు చాలా మందికి బాడీలో వైబ్రేష‌న్ వ‌చ్చేస్తాయి. అంత క్రేజ్ ఉంది ప‌వ‌న్‌కి. ఆయ‌న న‌టించిన చిత్రాలు చాలా త‌క్కువ కానీ ఆయ‌న‌కున‌న క్రేజ్ మాత్రం మాములుది కాదు. ఏకంగా మ‌న భార‌త‌దేశాన్నే ఊపేసేంత క్రేజ్ ప‌వ‌న్‌కు ఉంది. ప‌వ‌న్ సినిమాలంటే యూత్‌లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయ‌న న‌టించిన బ‌ద్రీ చిత్రానికి ఒక ర‌క‌మైన క్రేజ్ ఉంటే.. అందులోని పాట‌లు అప్ప‌ట్లో చాలా డిఫ‌రెంట్‌గా ఉండేవి. అప్ప‌ట్లో ప‌వ‌న్ సినిమాలోని పాట‌లు అన్ని భాష‌ల్లో క‌లిసి ఉండేవి ఉదాహ‌ర‌ణ బ్ర‌దీలోని `ఏ మేరా జ‌హా ఏమీర ఘ‌ర్ మీరా ఆషియా` అన్న పాట‌కు వ‌చ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ పాట‌లు విని విని క్యాసెట్లు అరిగిపోయేవి. ఆ త‌ర్వాత ఖుషీ సినిమాకి అప్ప‌ట్లో వ‌చ్చిన క్రేజ్ మాముదికాదు ఇక అందులోని స‌న్నివేశాల గురించి కూడా పెద్ద‌గా చెప్పుకోవ‌ల‌సినవ‌స‌రం లేదు. ఇప్ప‌టికీ చాలా మంది హీరోలు, క‌మెడియ‌న్లు దాన్ని ఏదో ఒక సినిమాలో ఇమిటేట్ చేస్తూనే ఉన్నారు. అలాగే తొలి ప్రేమ కీర్తి రెడ్డితో క‌లిసి న‌టించిన చిత్రం కూడామంచి హిట్ కొట్టింది. 

 

ఇలా ప‌వ‌న్ ప్ర‌తి సినిమాకీ ఏదో ఒక్క కొత్త‌ద‌నం చూపిస్తూ త‌న న‌ట‌న ప‌రంగా డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ యాంగిల్స్‌లో న‌టించ‌బ‌ట్టే ఆయ‌న న‌టించిన సినిమాలు త‌క్కువే అయినా ఫ్యాన్స్‌లో ఆయ‌న‌కు వ‌చ్చిన క్రేజ్ మాత్రం ఒక రేంజ్‌లో ఉంటుంది. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌కీయాల్లో బిజీగా ఉంటూ సినిమాల‌కు కాస్త దూరంగా ఉన్నారు. ఇప్పుడు పింక్ రీమేక్ చిత్రంతో తిరిగి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం తెర‌మీద ఉంది. ఇక ఇదిలా ఉంటే. ఫ్యాన్స్ ఆయ‌నను తిరిగి తెర మీద చూసేందుకు వెయ్యి క‌ళ్ళ‌తో ఎదురు చూస్తున్నారు. మ‌రి ఈ సారి ప‌వ‌న్ ఫ్యాన్స్ కోసం ఏకంగా ఒకేసారి నాలుగు చిత్రాల్లో న‌టించ‌నున్నారు. ఆయ‌న చిత్రాల్లో క‌థ ఎలా ఉన్నా... ప‌వ‌న్ అంటే చాలు క‌లెక్ష‌న్లు ఒక ఊపు ఊపాల్సిందే మ‌రి.

 

 ప్ర‌స్తుతం నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ప‌వ‌న్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. ప‌వ‌న్ డేట్ ఇవ్వ‌డ‌మే అదృష్‌టంగా భావించే నిర్మాత‌లు టాలీవుడ్ లో చాలా మందే ఉన్నార‌ని చెప్పాలి. మ‌రి ఇంత క్రేజ్ రావ‌డ‌మంటే మాములు విష‌యం కాద‌నే చెప్పాలి. ఆ క్రేజ్ మిగ‌తా హీరోస్ కి ఉండ‌దు. సినిమా కాస్త అటూ ఇటూ అయినా ప్రేక్ష‌కులు థియేట‌ర్ కి రావ‌డం క‌ష్ట‌మే. కానీ ప‌వ‌న్ విష‌యంలో అలా ఉండ‌దు. 

మరింత సమాచారం తెలుసుకోండి: