పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ కు రోజురోజుకు క్రేజ్  పెరిగి పోతూనే ఉంది. కొంతమంది పవన్ సినిమాలకు అభిమానులు అయితే కొంతమంది పవన్ వ్యక్తిత్వానికి అభిమానులు అవుతారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన పవన్ కళ్యాణ్ అభిమానుల పవర్ స్టార్ గా మారి అన్నకు తగ్గ తమ్ముడుగా పేరు తెచ్చుకున్నారు. అయితే పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ను  అభిమానులు ఎంతగానో ఆరాధిస్తారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా విషయం తెలిసిందే. 

 

 

 

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నట్లే మరెన్నో ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఖుషి సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సరైన హిట్ రాలేదనే చెప్పాలి. భిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. పవన్ కళ్యాణ్ మంచి విజయం సాధించలేకపోయాడు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నప్పటికీ అభిమానులు మాత్రం పవన్ వెన్నంటే ఉన్నారు. దాదాపు పదేళ్ల తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు పవన్ కళ్యాణ్. కానీ ఈ పదేళ్ల పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు నరకమే అని చెప్పాలి. 

 

 

 

 పదేళ్ల నుంచి ఎన్నో విభిన్నమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. తాము ఆరాధించే అభిమాన హీరో సినిమా హిట్ అవుతుందని పవన్ అభిమానులు ఎన్నో  ఆశలు పెట్టుకున్నప్పటికీ ఒక్క సినిమా కూడా.. విజయం సాధించకపోవడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో నిరాశ చెందారు. అటు పవన్ కళ్యాణ్ కూడా హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా హిట్ కొట్టలేకపోయారు. అయితే పవన్ ఫ్యాన్స్ ఎంత నిరాశ చెందినప్పటికీ పవన్ వెన్నంటే నడిచారు. 2012 సంవత్సరంలో... దాదాపు పది సంవత్సరాల తర్వాత... హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా విజయం అటు పవన్ కళ్యాణ్ లో... ఇటు పవర్ స్టార్ ఫాన్స్ అందరిలో సరి కొత్త ఉత్తేజాన్ని నింపింది అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: