టాలీవుడ్ లో ఓ సెన్సేషనల్ కాంబినేషన్ సెట్ అవుతోంది. బాక్సాఫీస్ దిమ్మతిరిగేలా.. సినీ జనాలకు కూడా మైండ్ బ్లాక్ అయ్యేలా క్రేజీ కాంబినేషన్ ను ప్లాన్ చేస్తున్నాడు వంశీ పైడిపల్లి. సూపర్ స్టార్, రౌడీ స్టార్ ఇద్దరినీ కలిపి స్క్రీన్ పైకి తీసుకొస్తున్నాడు వంశీ. 

 

స్క్రీన్ పై మహేశ్ బాబు కనిపిస్తే చాలు ప్రేక్షకులు ఊగిపోతారు. అలాంటి సూపర్ స్టార్ కు రౌడీస్టార్ విజయ్ దేవరకొండ తోడైతే ఇంక థియేటర్ ఓ రేంజ్ లో వెలిగిపోతుందని చెప్పొచ్చు. యూత్ లో సూపర్ క్రేజ్ ఉన్న విజయ్, టాలీవుడ్ టాప్ స్టార్ మహేశ్ కలిసి నటిస్తే బాక్సాఫీస్ కు కూడా ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఇలాంటి ఎనర్జిటిక్ మూవీనే ప్లాన్ చేస్తున్నాడు వంశీ పైడిపల్లి.

 

వంశీ పైడిపల్లి తర్వాత మహేశ్ బాబుతో ఓ సినిమా తీయబోతున్నాడు. మహర్షి తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న మూవీపై టాలీవుడ్ లో మంచి బజ్ ఉంది. ఈ హైప్స్ ను మరింత పెంచేందుకు విజయ్ దేవరకొండని తీసుకొస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరుగుతోంది. 

 

మహేశ్ బాబు సినిమాలో హీరోతో సమానంగా ఓ కీలక పాత్ర ఉందట. ఈ క్యారెక్టర్ కోసమే విజయ్ ని సంప్రదిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అయితే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విజయ్, సపోర్టింగ్ రోల్ లోకి ఒప్పుకుంటాడా.. మహేశ్ బాబుతో కలిసి నటిస్తాడా అనేది చూడాలి. 

 

వంశీపైడి పల్లి అనుకున్నట్టు జరిగితే ప్రేక్షకులకు పండుగే పండుగ. ఇటు సూపర్ స్టార్ మహేశ్ బాబు, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వెండితెరపై కనిపిస్తే ఫ్యాన్స్ మాత్రం ఫుల్ జోష్ తో ఊగిపోతారు. ఇదే సందర్భం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ సైలెంట్ డైలాగ్స్.. విజయ్ దేవరకొండ కత్తిలాంటి కామెంట్ లు తోడైతే వెండితెరపై మెరుపులు మెరవడం ఖాయం. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ రావాలని ప్రేక్షకలోకం కోరకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: