ప్రతి ఏడాది మాదిరిగా మొన్నటి సంక్రాంతి సందర్భంగా మొత్తం టాలీవుడ్ లో నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా వాటిలో సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు, అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలవైకుంఠపురములో సినిమాలు మాత్రమే మంచి కలెక్షన్స్ సాధించి ప్రేక్షకుల మెప్పు పొందాయి. అయితే ఇక్కడ ఈ రెండు సినిమాల విషయమై ఒకటి మాట్లాడుకుంటే, ముందుగా సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా పక్కా కమర్షియల్ గా తెరకెక్కడంతో పాటు మహేష్ బాబు కూడా చాలా గ్యాప్ తరువాత మంచి ఎంటర్టైనింగ్ రోల్ లో నటించడం జరిగింది. నిజానికి ఈ సినిమాకి యావరేజ్ టాక్ మాత్రమే వచ్చినప్పటికీ మహేష్ చరిష్మా తో పాటు, సంక్రాంతి సీజన్ కూడా ఈ సినిమాకు అద్భుతమైన రేంజ్ లో కలెక్షన్ దక్కడానికి కారణంగా నిలిచాయి. 

 

ఇక అలవైకుంఠపురములో సినిమా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో మంచి ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్, యాక్షన్, పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ తో అదిరిపోయింది. తొలి రోజు నుండి మంచి టాక్ సంపాదించిన ఈ సినిమాకు కూడా భారీగానే కలెక్షన్స్ వచ్చాయి. సంక్రాంతి సీజన్ కూడా ఈ సినిమాకు ఎంతో మంచి చేసింది. ఇక ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న వివరాలను బట్టి  చూస్తే, సరిలేరు సినిమా ఎక్కువగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కుమ్మితే, అల సినిమా ఎక్కువగా ఓవర్సీస్ లో అదరగొట్టింది. అయితే మంచి సక్సెస్ టాక్ అనేది ప్లస్ పాయింట్ గా ఉన్న అల సినిమాకు ఇప్పటికీ కూడా సరిలేరు తో పోలిస్తే ఒకింత మంచి కలెక్షన్ లభిస్తోంది అనేది ఒప్పుకోవాల్సిన అంశం. 

 

ఇకపోతే ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే, సరిలేరు సినిమా యావరేజ్ టాక్ సంపాదించినప్పటికీ కూడా టాక్ తో సంబంధం లేకుండా మంచి కలెక్షన్ తో దూసుకుపోయింది. నిజానికి మహేష్ సినిమాకు యావరేజ్ టాక్ వస్తే చాలు అది సూపర్ హిట్ రేంజ్ ని అందుకుంటుంది అని చెప్పడానికి గతంలో వచ్చిన ఆయన సినిమాలు కూడా కొన్ని రుజువు చేసాయి. ఆ విధంగా యావరేజ్ టాక్ మీద రన్ అవుతూ, మరోవైపు అల సినిమా మంచి టాక్ తో రన్ అవుతున్నప్పటికీ కూడా దానిని తట్టుకుని మంచి హిట్ రేంజ్ కలెక్షన్ సాధించిన సరిలేరు సినిమా ఒకింత నిజమైన సంక్రాంతి మొగుడు అని చెప్పవచ్చని అంటున్నారు. అయితే ఓవరాల్ గా సక్సెస్ టాక్ సంపాదించి, మంచి కలెక్షన్ తో దూసుకెళ్లిన అల సినిమా సూపర్ హిట్ అని మాత్రం మరిచిపోకూడదని కూడా అంటున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: