టాలీవుడ్ లో యంగ్ డైనమిక్ డైరెక్టర్స్ లో ఒకరు హరీష్ శంకర్.  ఈయన తీసే సినిమాలో హీరోయిజం మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. అప్పట్లో వరుస ఫెయిల్యూర్స్ తో సతమతమవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో బాలీవుడ్ సంచలన విజయం సాధించిన దబాంగ్ మూవీ రిమేక్ గా ‘గబ్బర్ సింగ్’ మూవీ తెరకెక్కించారు.  తెలుగులో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన యువ దర్శకులలో హరీశ్ శంకర్ ఒకరు.  ఈ మూవీ పవన్ కళ్యాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది.  అంతే కాదు పవన్ కళ్యాన్ మాస్ ఇమేజ్ తో పాటు స్టార్ డమ్ కూడా పెరిగిపోయింది. 

 

గబ్బర్ సింగ్ తర్వాత అత్తారింటికి దారేది తర్వాత ఆ స్థాయిలో మంచి హిట్ అందుకోలేకపోయారు పవన్ కళ్యాన్.  సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ పవన్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచింది.  అయితే అప్పట్లో పవన్ కళ్యాన్ తో డైరెక్టర్ హరీష్ శంకర్  ఓ మూవీ తెరకెక్కిస్తున్నారని వార్తలు వచ్చాయి.. కానీ అవి ఒట్టి వార్తలుగానే మిగిలిపోయాయి. గత ఏడాది వరుణ్ తేజ్ తొో గద్దలకొండ గణేష్ లాంటి సూపర్ హిట్ మూవీతో మరోసారి లైన్లోకి వచ్చారు హరీష్ శంకర్.  తాజాగా హరీష్ శంకర్ తన తదుపరి సినిమాను పవన్ కల్యాణ్ తో చేయనున్నాడనీ, అది కూడా రీమేక్ సబ్జెక్ట్ అంటూ వార్తలు వస్తున్నాయి.

 

ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.  దీనిపై స్పందించారు హరీష్ శంకర్. పవన్ కల్యాణ్ తో నేను సినిమా చేయనున్నట్టుగా వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. ఇదంతా కేవలం పుకారు మాత్రమే. వాస్తవానికి పవన్ తో  సినిమా తీయాలని ఉన్నా సరైన కథ కోసం ఎదురు చూస్తున్నా అన్నారు.  నా తదుపరి సినిమాకి సంబంధించిన విషయాలను నేను అధికారికంగా ప్రకటిస్తాను  అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: