పింక్ చిత్రంతో ప‌వ‌ర్‌ష్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న విష‌యం తెలిసిందే. అయితే చాలా గ్యాప్ త‌ర్వాత చేస్తున్న‌డు కాబ‌ట్టి ఫ్యాన్స్‌లో హంగామా మాములుగా లేదు. ఇక ఇదిలా ఉంటే ఈ ఏడాది ఏకంగా ప‌వ‌న్ నాలుగు చిత్రాల్లో న‌టించ‌నున్నారు. ఆల్రెడీ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండ‌గా మ‌రో రెండు చిత్రాల‌కు సంతకాలు అయిపోయాయి. మూడు సినిమాల్ని ఒప్పుకోవ‌డం, మూడు సినిమాల్లోనూ ప‌వ‌న్ వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌లు చేయ‌డం… మూడూ పెద్ద బ్యాన‌ర్లే కావ‌డం ఆనందించాల్సిన విష‌య‌మే. 

 

ఇక ప‌వ‌న్ ఈ సినిమాల‌కు తీసుకున్న పారితోషికం సంగ‌తులు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వ‌స్తున్నాయి. ఆ రెమ్యూన‌రేష‌న్ ఫిగ‌ర్ వింటే షాక‌వ్వాల్సిందే. మైత్రీ మూవీస్ ద‌గ్గ‌ర‌, ఏఎంర‌త్నం ద‌గ్గ‌ర ప‌వ‌న్ అడ్వాన్సులు తీసుకున్నాడు. వాళ్ల‌కు ఓ సినిమా చేయాల్సిన అవ‌స‌రం ప‌వ‌న్‌పై ఉంది. ఎప్ప‌టి నుంచో ఈ రెండు సంస్థ‌ల్నీ ఊరిస్తూ వ‌చ్చిన‌ ప‌వ‌న్‌. వీళ్ల‌కంటే ముందు దిల్‌రాజుకి క‌మిట్‌మెంట్ ఇచ్చి మిగిలిన ఇద్ద‌రు నిర్మాత‌ల్నీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాడు. రోజుకి ఇంత అని.. దిల్ రాజు పారితోషికం ఇవ్వ‌డానికి ముందుకు వ‌చ్చాడ‌ట‌. దాంతో ప‌వ‌న్ టెప్టేష‌న్ ఎక్క‌డా ఆగ‌లేదు. ఇక `పింక్‌` సినిమా ప‌ట్టాలెక్కేసింది. ఈసినిమాతో ప‌వ‌న్ దాదాపు 40 కోట్ల పారితోషికం అందుకోబోతున్న‌ట్టు వ్యాపార వ‌ర్గాలు స‌మాచారం. ప‌వ‌న్ రీ ఎంట్రీ, అందులోనూ ఓ రీమేక్ సినిమా, పైగా 20 రోజుల కాల్షీట్లు.. ఇవ‌న్నీ దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే 40 కోట్ల పారితోషికం అన్న‌ది చూస్తుంటే అమ్మో అని అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. ఇప్పుడు దిల్‌రాజు ఇచ్చిన అంకెని చూపించే – అటు ఏఎంర‌త్నం ద‌గ్గ‌ర‌, ఇటు మైత్రీ మూవీస్ ద‌గ్గ‌ర మ‌రింత పారితోషికం డిమండ్ చేశాడంట ఈ గ‌బ్బ‌ర్‌సింగ్‌.

 

ఎ.ఎం.ర‌త్నం నుంచి అప్ప‌ట్లో ప‌వ‌న్ దాదాపు 20 కోట్లు దాకా అడ్వాన్స్ తీసుకున్నాడు.. ఆ 20 కోట్ల‌కూ ప‌వ‌న్ సినిమా చేసి పెట్టాలి. కానీ దిల్ రాజు ఇచ్చిన రెమ్యూన‌రేష‌న్ చూపిస్తూ తిరిగి వాళ్ళ‌ని డిమాండ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే ఇందుకు ఎ.ఎంర‌త్నం కూడా ఒప్పుకుని ఆయ‌న అడిగినంత మొత్తాన్ని ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డ్డారంట‌. అంటే దీన్ని బ‌ట్టే అర్ధ‌మ‌వుతుంది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌ర్ ఏంట‌న్న‌ది. 

 

ఇక స‌రిగ్గా ఇదే విష‌యాన్ని మైత్రీ మూవీస్ ద‌గ్గ‌రా చెప్ప‌గా. ప‌వ‌న్ పారితోషికం 25 నుంచి 30 కోట్ల లోపు ఫిక్స్ చేసింది మైత్రీ. ఇది వ‌ర‌కే అడ్వాన్సు తీసుకున్నాడు కాబ‌ట్టి ప‌వ‌న్ కూడా ఇదే మొత్తానికి సినిమా చేస్తాడ‌ని మైత్రీ నిర్మాత‌లు భావించారు. కానీ దిల్ రాజు సినిమాకి 40 కోట్ల పారితోషికం ఇచ్చార‌ని, ఈ సినిమాకీ అదే స్థాయిలో ఇవ్వాల‌ని ప‌వ‌న్ అడిగిన‌ట్టు, చివ‌రికి మైత్రీ వాళ్ళు కూడా న‌ల‌భై కాక‌పోయినా అంత‌కు ద‌గ్గ‌ర‌లో ఇవ్వ‌డానికి ఒప్పుకున్నారు. మొత్తానికి ఈ మూడు సినిమాల ద్వారా దాదాపుగా 120 కోట్లు పారితోషికం అందుకోబోతున్నాడు. ఏది ఏమైనప్ప‌టికీ కాస్త గ్యాప్ అయితే ఇచ్చాడు కానీ ప‌వ‌న్ రీఎంట్రీతో టాలీవుడ్ నిర్మాత‌ల‌కు మాత్రం ఆయ‌న రెమ్యూన‌రేష‌న్‌తో మంటెక్కిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: