సెకండ్ ఇన్నింగ్స్‌ను స‌క్సెస్‌ఫుల్‌లా కొన‌సాగిస్తున్న నితిన్‌కు గుడ్ టైం స్టార్ట్ అయింద‌నే చెప్పవ‌చ్చు. సెకండ్ ఇన్నింగ్స్‌లో నితిన్ ఇంతలా ముందుకు దూసుకుపోవ‌డానికి కార‌ణం ఓ ర‌కంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని చెబుతుంటారు. ఎందుకంటే నితిన్ న‌టించిన ఇష్క్ మూవీ ఆడియో ఫంక్షన్‌కు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రావ‌డం, ఆ మూవీ ఊహించిన దానికంటే స‌క్సెస్‌ను అందుకోవ‌డం జ‌రిగింది. అలాగే ఇష్క్ మూవీ త‌రువాత వ‌చ్చిన‌ గుండెజారి గ‌ల్లెంత‌య్యిందే మూవీ సైతం బాక్సాపీస్ వ‌ద్ద స‌క్సెస్‌ను అందుకుంది. గుండెజారి గ‌ల్లెంత‌య్యిందే మూవీ ఆడియో ఫంక్షన్‌లోనూ నితిన్ నోటి నుండి ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌పం ప‌దే ప‌దే వ‌చ్చింది. అలాగే ఆ మూవీలో తొలిప్రేమ సాంగ్‌ను రిమేక్ చేసి ప‌వ‌న్ అభిమానుల‌ను నితిన్‌ ట‌చ్ చేశాడు. దీంతో నితిన్ కూడ ప‌వ‌న్‌కు వీరాభిమాని కావ‌డంతో, మెగా అభిమానులు నితిన్‌ను కూడ ఆధ‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే నితిన్ అప్‌కిమంగ్ ఫిల్మ్ హార్ట్‌టాక్‌ మూవీ ఆడియో ఫంక్షన్‌కు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రాలేక‌పోవ‌డం కార‌ణంతో ప‌వ‌న్‌కు నితిన్‌కి మ‌ధ్య గ్యాప్ పెరిగింద‌ని టాలీవుడ్‌లో వార్తలు హ‌ల్‌చ‌ల్ చేశాయి. కాని సాయిధ‌ర‌మ్‌తేజ్ న‌టించిన రేయ్ మూవీ ఆడియో ఫంక్షన్‌లో మాత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోటి నుండి నితిన్ మాట వ‌చ్చింది. అంతే కాకుండా నితిన్ అంటే ప‌వ‌న్‌కు ఇష్టమేన‌ని, నా అండ‌దండ‌లు, ఆశీస్సులు నితిన్‌కు వెన్నంటే ఉంటాయ‌ని చెప్పక‌నే చెప్పాడు. దీంతో హార్ట్‌టాక్ మూవీకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆశీస్సులు దొరికాయ‌ని నితిన్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడ‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: