సినిమా ఇండస్ట్రీ మొత్తం విజయం చుట్టూనే తిరుగుతుంది. సక్సెస్ ఉంటేనే ఇండస్ట్రీలో ఒక విలువ ఉంటుంది. ఎవరికైతే సక్సెస్ ఉంటుందో వారిని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సక్సెస్ లేని వారికి ఎంత టాలెంట్ ఉన్నా పక్కన పడేస్తారు. టెక్నీషియన్ దగ్గర నుండి హీరో, హీరోయిన్, దరశకుడి వరకూ ఇదే సూత్రం పనిచేస్తుంది. ఇక దర్శకుల విషయంలో ఇది ఇంకా పక్కాగా అమలు అవుతుంది. 

 

 

 

 

ఒక దర్శకుడు ఫ్లాప్ ఇచ్చాడంటే అతనితో సినిమా తీయడానికి చాలా ఆలోచిస్తారు. కానీ టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు లెక్కలు మాత్రం వేరుగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఆయన తెరకెక్కించిన చిత్రాల్ని గమనిస్తే, అన్ని ఫ్లాప్ డైరెక్టర్లతో తెరెకెక్కించినవే. గతంలో సక్సెస్ లు ఉండి ఫ్లాప్ ఎదురై ఖాళీగా ఉన్న దర్శకులకి అవకాశం ఇస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ తో తెరెకెక్కిస్తున్న "నారప్ప" విషయంలోనూ అదే జరిగింది.

 

 

అయితే సురేష్ బాబుకి ఫ్లాప్ డైరెక్టర్లు అంటే ఎందుకు ఇష్టం అనేది అందరికీ అనుమానంగా ఉంది. దీనికి సంబంధించి సురేష్ బాబు లెక్కలు వేరేగా ఉన్నాయట. హిట్ ఇచ్చిన దర్శకుడితో సినిమా తీయాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టాల్సి వస్తుంది.. అలాగే హిట్ ఇచ్చిన దర్శకుడికి కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ వల్ల కొన్ని తప్పులు చేస్తుంటారు. అదే ఫ్లాప్ ఇచ్చిన దర్శకులు జాగ్రత్తగా వ్యవహరిస్తారు.

 

 

 

ఆల్రెడీ ఫ్లాప్ ఇచ్చారు కాబట్టి సినిమా విషయంలో హిట్ కసిగా కొట్టాలనే కసితో ఉంటారు. ఎలాగైనా హిట్ కొట్టాలని స్క్రిప్ట్ విషయంలో ఒకటికి రెండు సార్లు జాగ్రత్త పడతారు. ఏదైనా సలహా ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో ఉంటారు. ప్లాప్ లో ఉంటారు కాబట్టి నిర్మాత కష్టాలు తెలుస్తాయి, బడ్జెట్ నియంత్రణ గురించి కొంత అవగహన ఉంటుంది. ఈ కారణాలతో సురేష్ బాబు ప్లాప్ దర్శకులతో పనిచేయడానికి మక్కువ చూపుతున్నట్లు మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: