వరుణ్, దివ్యా రావు హీరో హీరోయిన్లుగా టీనేజ్ లవ్ బ్యాక్ డ్రాప్‌లో `డిగ్రీ కాలేజ్` అనే సినిమాను రూపొందించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి  నరశింహనంది స్వీయ దర్శకత్వం వ‌హించ‌గా.. శ్రీ లక్ష్మీ నరశీంహ సినిమా పతాకంపై నిర్మించారు. ఈ మూవీకి సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 7 న ఈ చిత్రం విడుదల అవుతుంది. కాగా డిగ్రీకాలేజ్ ప్రి రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్ లో ఘనంగా జరిగింది. ఈ క్ర‌మంలోనే విడుదలైన టీజ‌ర్ యూ ట్యూబ్‌లో కేవ‌లం  10 నిమిషాల్లోనే బ్యాన్ చేసారంటే ఈ ట్రైల‌ర్ వేడి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అంత‌గా హాట్ సీన్స్ పెట్టి సినిమా తెర‌కెక్కిస్తున్నాడు నంది.

 

యూత్ ని ఆకట్టుకోవడానికి సినిమాలో ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు ఉంటే చాలని అనుకుంటున్నారు కొందరు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో బూతు కంటెంట్ తో సినిమాలు తీస్తూ జనాలపై వదులుతున్నారు. ఇప్పుడు అదే త‌ర్హాలో డిగ్రీ కాలేజ్ సినిమా ఉంటుంద‌ని ట్రైల‌ర్ చూస్తేనే అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఇది చూసిన త‌ర్వాత ఇండస్ట్రీలో కొందరు ఫైర్ అవుతున్నారు. అస‌లు మ‌న సినిమాల్లో ఇలాంటి సీన్స్ ఎందుకు పెడుతున్నారు.. ఇలాంటి సీన్స్ పెట్టి ఎవ‌ర్ని నాశ‌నం చేద్దామ‌ని అంటూ వాళ్లు కామెంట్ చేస్తున్నారు.

 

అయితే తాజాగా డిగ్రీ కాలేజీ సినిమాలో ఉన్న అశ్లీల దృశ్యాలను వెంటనే తొలగించాలని పీవైఎల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ప్రదీప్‌ డిమాండ్‌ చేశారు. ఈ సినిమాలో టైటిల్‌ అభ్యంతరంతోపాటు విజ్ఞానానికి కేంద్రమైన తరగతి గదిని అవమానపరిచారని ఆరోపించారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా గతంలో పీవైఎల్‌, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సెన్సార్‌ బోర్డు, సిటీ పోలీస్‌ కమిషనర్‌, ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సినిమాలోని అశ్లీల దృశ్యాలను తొలగించాలని లేనిపక్షంలో సినిమాను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: