ఇటీవల తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా తెరకెక్కిన 96 అనే లవ్ స్టోరీ మూవీ ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే. యువ దర్శకుడు సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమాకు హృద్యమైన కథ, కథనాలతో పాటు హీరో, హీరోయిన్లు ఇద్దరూ కూడా ఎంతో సహజత్వం తో కూడిన నటనను ప్రదర్శించడం ఆ సినిమా విజయానికి ఒక కీలక కారణంగా చెప్పవచ్చు. కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఉన్న పలు ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఆ సినిమాపై పొగడ్తలు కురిపించారు. ఇక ప్రస్తుతం జాను పేరుతో తెలుగులో రీమేక్ అయిన ఆ సినిమాలో హీరో, హీరోయిన్లుగా శర్వానంద్, సమంత అక్కినేని నటించడం జరిగింది. 

 

ఒరిజినల్ మాతృకకు దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు కూడా అదే బాధ్యతను నిర్వహించడం జరిగింది. ఇక ఇప్పటికీ రిలీజ్ అయిన ఈ సినిమాలోని సాంగ్స్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడంతో సినిమా కూడా తప్పకుండా మంచి సక్సెస్ సాదిస్తుందని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా హీరోయిన్ సమంత నిన్న విశాఖపట్నంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ, తనకు సినిమాలోని చాలా సీన్స్ లో ఎంతో ఏడుపు వచ్చిందని, హృదయాన్ని కదిలించే ఆ సన్నివేశాల్లో నటించేటపుడు తనకు గ్లిజరిన్ అవసరం కూడా లేదని, కావున రేపు ఈ సినిమా చూడడానికి థియేటర్స్ కు వచ్చే వారు కర్చీఫ్ తప్పకుండా తీసుకువెళ్ళండి, 

 

నిజమైన ప్రేమతో ఈ సినిమా మిమ్మల్ని తప్పకుండా కదిలిస్తుందని చెప్పింది. అయితే 96 మూవీ పూర్తిగా కంటెంట్ బేస్డ్ గానే కథ నడవంతో, ఎటువంటి కమర్షియల్ హంగులు లేని ఆ జానర్ మన తెలుగు వారికి ఎంత వరకు నచ్చుతుందని అనే అనుమానం కొందరిలో కలుగుతుంది. అదీకాక ముఖ్యంగా జాను రిలీజ్ తరువాత తప్పకుండా ఇందులోని సీన్స్ ని 96 తో కొందరు కంపేర్ చేసి చూస్తారు. ఒకవేళ ఏ మాత్రం ఆ సినిమాని జాను కనుక అందుకోలేకపోతే అది సినిమాకు పెద్ద దెబ్బేసే ప్రమాదం ఉందని, ఒక రకంగా అది జానుకి కత్తిమీద సాము వంటిదని అంటున్నారు. మరొక రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి....!! 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: