టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆర్య, బన్నీ, దగ్గరినుండి మొన్నటి అలవైకుంఠపురములో సినిమా వరకు కొన్ని సూపర్ హిట్స్ తో పాటు మరికొన్ని ఫ్లాప్స్ కూడా అయన అందుకున్నారు. ఇక కెరీర్ మొదటి నుండి మంచి డ్యాన్సర్ గా పేరున్న బన్నీ, ఒక్కొక్క సినిమాతో మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తన కష్టంతో నేడు ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఇటీవల మలయాళంలో కూడా అల్లు అర్జున్ సినిమాలకు మంచి క్రేజ్, మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఇక బన్నీ సినిమా వస్తుందంటే చాలు యువతలో మంచి హడావుడి ఉంటుందని, 

 

ఆయన యాక్షన్, డాన్స్ లకు అమ్మాయిలు ఎక్కువగా అట్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్న అల్లు అర్జున్ గురించి ప్రముఖ శృంగార నటి షకీలా అన్న ఒక్క మాట ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో సంచలనంగా ప్రచారం అవుతోంది. ఇక మ్యాటర్ ఏంటంటే, మొదట మలయాళ శృంగార తారగా ఎన్నో సినిమాల్లో నటించి అక్కడి హీరోలను సైతం గడగడలాడించిన షకీలా, ఆ తరువాత అటువంటి సినిమాలు చేయడం ఆపేశారు. ఆపై అక్కడి నుండి కొన్ని సినిమాల్లో నటిస్తూ వస్తున్న షకీలా ప్రస్తుతం మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇకపోతే నేడు ఒక యూట్యూబ్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ, తన కెరీర్ లోని ఒడిదుడుకుల గురించి ప్రస్తావించడం జరిగింది. 

 

ఇక టాలీవుడ్ నటుల గురించి చెప్పమని వరుసగా మన హీరోల పేర్లు యాంకర్ అడుగుతున్న సమయంలో దాదాపుగా చాలా మంది హీరోల గురించి చెప్పుకొచ్చిన షకీలా, సడన్ గా అల్లు అర్జున్ గురించి అడగ్గానే నాకు తెలియదు అని అనగానే యాంకర్ కూడా ఆ ప్రశ్నను అంతటితో ఆపేయడం గమనించవచ్చు. ఇప్పుడు దీనిపైనే బన్నీ ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. టాలీవుడ్ లో ఎంతో పేరున్న బన్నీకి అటు మలయాళం లో కూడా మంచి ఆదరణ ఉన్న విషయం తెలుసునని, అయితే అటువంటి హీరో గురించి షకీలా తెలియదని చెప్పడం సరైనది కాదని అంటున్నారు. ఇక దీనిపై మరికొందరి వాదన వేరోలా ఉంది, నిజానికి ఆమెకు బన్నీ తో పరిచయం లేకపోవడం వల్లనే ఆమె ఆలా చెప్పి ఉండవచ్చు కదా అని అంటున్నారు. మరి ఇందులో ఏది వాస్తవం అనే విషయం అటుంచితే, అసలు ఇది పెద్దగా రచ్చ చేయాల్సిన విషయం కాదని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.... !! 

మరింత సమాచారం తెలుసుకోండి: