మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు ఆయన కెరీర్లో 151 చిత్రాలు చేశారు. ఇక ప్రస్తుతం 152 చిత్రం షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ 151 చిత్రాలలో ఎన్నో  సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం చిరంజీవి సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం చిరంజీవి ఒకే సమయంలో చాలా సినిమాల్లో నటించారు. దాదాపు సంవత్సరానికి 10 సినిమాల వరకు చిరంజీవి నటించేవారు. ఈ విషయాన్ని పలుమార్లు చిరంజీవి కూడా. అయితే ప్రస్తుతం ఏ హీరోలు కూడా ఈ రేంజిలో సినిమాలు చేయడం లేదు... హీరోలే కాదు ఏ క్యారెక్టర్ ఆర్టిస్టులు గాని హీరోయిన్లు కానీ ఒకే సమయంలో ఎక్కువ సినిమాల్లో నటించడం చాలా అరుదుగా చూస్తుంటాం. కేవలం కొంతమంది హీరోయిన్లు మాత్రమే అప్పుడప్పుడు రెండు సినిమాల షూటింగ్లో పాల్గొంటూ ఉంటారు. కానీ నేటి తరం హీరోలు మాత్రం ఒక సినిమా పూర్తయిన తర్వాత  ఇంకో సినిమాల్లోకి అడుగు పెడుతున్నారు. 

 


 కానీ ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం అన్న బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే రోజు రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. ఓవైపు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తుండగా... మరో వైపు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా పవన్ కళ్యాణ్ 27 వ చిత్రం గా ప్రారంభం కాబోతుంది. కాగా దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించి షూటింగ్ ఈ రోజు నుంచే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది, ఈ క్రమంలో రాత్రి సమయంలో సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్... డే టైం లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. 


 ఇదే సమయంలో అటు పార్టీ వ్యవహారాలను కార్యక్రమాలను కూడా చూసుకోవడానికి... సమీక్షలు నిర్వహించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తానికి గతంలో చిరంజీవి ఎక్కువ సినిమాలో షూటింగ్ లో పాల్గొని కష్టపడ్డట్టుగానే...  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా అలాగే  కష్టపడేందుకు  సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే డే టైం లో ఒక సినిమా షూటింగ్ నైట్ టైం లో ఇంకో సినిమా షూటింగ్.. మరోవైపు రాజకీయాలు. ఇలా మూడు పడవల ప్రయాణం కాస్త డేంజర్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం ధైర్యం చేసి ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: