సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే కోలీవుడ్ లో వెర్రి, పిచ్చి ఎక్కిపోయోవాళ్ళు ఎంతమంది ఉంటారో లెక్కేలేదు. ఎన్ని సినిమాలు ఫ్లాపయినా ఆయన క్రేజ్ మాత్రం అంతకంతకి పెరుగుతూనే ఉంది తప తగ్గడం లేదు. అంతేకాదు కోలీవుడ్ లో సూర్య, విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోలకి సూపర్ స్టార్ ఈ వయసులోను గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక రజనీకాంత్ గత చిత్రాలు కబాలి, కాలా, పేట సినిమాలు కోలీవుడ్ లో భారీ ఫ్లాప్ సినిమాలుగా మిగిలాయి. ఇక టాలీవుడ్ లో అయితే చెప్పనవసరం లేదు. ఇక సంక్రాంతికి వచ్చిన ద‌ర్భార్' సినిమా భారీగా న‌ష్టాల వ్య‌వ‌హారం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

 

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించిన ఆ సినిమాకు సంబంధించి న‌ష్ట‌పోయిన వాళ్లంతా రోడ్డెక్కారు. భారీ ధ‌ర‌ల‌కు దర్బార్ సినిమాను కొన్న వాళ్లు ఇప్పుడు అదే భారీ స్థాయి న‌ష్టాలు రావ‌డంతో.. ప‌రిహారం కావాలని అడుగుతున్నారు. ఇప్ప‌టికే ఆ సినిమా ప్రొడక్ష‌న్ హౌస్ ను వాళ్లు చుట్టుమ‌ట్టినా.. నిర్మాత‌లు మాకు సంబంధం లేదంటూ చేతులెత్తేశారు. మేము కూడా ఆ సినిమాతో న‌ష్ట‌పోయిన‌ట్టుగా.. ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ భారీ పారితోష‌కం తీసుకున్నాడ‌ని, న‌ష్టాల‌ను అత‌డితో వ‌సూలు చేసుకోవాల‌ని దాని నిర్మాత‌లు స్ప‌ష్టం చేశార‌ట‌.

 

దాంతో డిస్ట్రిబ్యూట‌ర్లందరూ డైరెక్టర్ మురుగ‌దాస్ ఆఫీసును ముట్ట‌డించిన‌ట్టుగా తాజా సమాచారం. చెన్నైలో ఈ విషయంలో వ‌ర‌స‌గా త‌న ఆఫీసు మీద కొంత‌మంది అగంత‌కులు ప‌డుతున్నార‌ని, త‌మ వారిని బెదిరించారని అంటున్నారట ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్. త‌మ వాళ్ల‌పై దాడి జ‌రిగిన నేప‌థ్యంలో.. త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరుతూ చెన్నై పోలిస్ క‌మిష‌న్ ను ఆశ్ర‌యించాడ‌ట. ఇలా ద‌ర్బార్ సినిమాతో డిస్ట్రిబ్యూట‌ర్లు భారీగా న‌ష్ట‌పోవ‌డంతో ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్ కు ఇబ్బందిక‌రంగా మారిందట.

 

ఇక ఇప్పటి వ‌ర‌కూ మురుగదాస్ కొన్ని సినిమాల‌ను ప్రొడ్యూస్ చేశాడు. అప్పుడు కూడా ఆయ‌న ఇలాంటి ఇబ్బందుల‌ను ప‌డ‌లేదు. అయితే ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించిన‌ సినిమాల న‌ష్టాలు మాత్రం మురుగ‌కు ఇలాంటి కష్టాలు తెచ్చిన‌ట్టుగా ఉన్నాయి. ద‌ర్భార్ సినిమాకు ఈ ద‌ర్శ‌కుడు ఏకంగా 60 కోట్ల రూపాయ‌ల పారితోష‌కం తీసుకున్నాడ‌ని అందుకే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌నేది కోలీవుడ్ మీడియా సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: