ఇండస్ట్రీ ఎక్కువగా సేఫ్ గేమ్ కే ప్రియారిటీ ఇస్తుంది. డేంజర్ జోన్ కు దూరంగా, ఇమేజ్ లెక్కలకు దగ్గరగా జర్నీ చేస్తుంది. అయితే విజయ్ దేవరకొండ మాత్రం రిస్క్ తీసుకోవడానికి ఓటేస్తున్నాడు. క్రేజీ ఇమేజ్ తెచ్చిపెట్టిన లవ్ స్టోరీని పక్కన పెట్టి, కొత్త కథల ప్రపంచంలోకి వెళుతున్నాడు విజయ్. 

 

విజయ్ దేవరకొండ అనగానే బాక్సాఫీస్ కు అర్జున్ రెడ్డి సినిమానే కనిపిస్తుంది. బోల్డ్ లవర్ ను గుర్తు చేసుకుంటుంది. ఇక తమిళ, హిందీ జనాల్లోనూ అర్జున్ రెడ్డిగానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. అయితే ఇప్పుడీ ఇమేజ్ నే వద్దనుకుంటున్నాడు రౌడీ హీరో. లవ్ స్టోరీస్ కు బ్రేకప్ చెప్పి, వైవిధ్యమైన కథల్లో నటించాలనుకుంటున్నాడు. 

 

విజయ్ దేవరకొండకు లవ్ స్టోరీస్ తోనే సూపర్ హిట్స్ వచ్చాయి. సో ఈ జానర్ లోనే సినిమాలు చేస్తే.. విజయ్ సేఫ్ గా బాక్సాఫీస్ రేసుని పూర్తి చెయ్యొచ్చు. కానీ విజయ్ మాత్రం ఈ సేఫ్ గేమ్ ని ఇష్టపడటం లేదు. నటుడు అన్ని రకాల పాత్రలు పోషించాలి. ఒకే ఛట్రంలో ఇరుక్కుపోకూడదు అనే ఫార్ములాని ఫాలో అవుతూ.. కొత్తకొత్త కథాంశాలను సెలక్ట్ చేసుకుంటున్నాడు. 

 

విజయ్ దేవరకొండ ఒకే రకమైన కథల్లో నటించేందుకు అంతగా ఆసక్తి చూపించడంలేదు. ఆర్టిస్ట్ గా ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూనే.. మార్కెట్ పెంచుకోవాలనుకుంటున్నాడు. యూనివర్సల్ స్టోరీస్ తో తమిళ్, హిందీ పరిశ్రమలకు వెళ్తున్నాడు. అందుకే పాన్ ఇండియన్ సబ్జెక్ట్ నే ప్రిఫర్ చేస్తూ ప్రేమకథలను పక్కనపెట్టేస్తున్నాడు విజయ్. 

 

మొత్తానికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ గట్టి నిర్ణయమే తీసుకున్నాడు. అందరూ వెళ్తున్న దారిలో వెళ్లకుండా సెపరేట్ రూట్ ఎంచుకున్నాడు. విజయ్ దేవరకొండ యూత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. లవ్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తే ఎగబడి చూస్తారు. కానీ విజయ్ దేవరకొండ కొత్త దారి ఎంచుకున్నాడు. కొత్త కథలతో ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేసేందుకు తహతహలాడుతున్నాడు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: