రామ్ చరణ్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రామ్  చరణ్ తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. తెలుగు ప్రేక్షకులకు మెగాపవర్ స్టార్ గా మారిపోయాడు. అయితే రామ్ చరణ్ సినిమాలో  హీరో నే కాదు రియల్ లైఫ్లో కూడా హీరో అనిపించుకున్నాడు. గతేడాది డిసెంబర్లో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నూర్  అహ్మద్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే నూర్ మొహమ్మద్ అటు మెగాస్టార్ కుటుంబానికి కూడా సన్నిహితుడిగా ఉన్నాడు. అయితే గత ఏడాది డిసెంబర్ 8న ఆయన గుండెపోటు కారణంగా మరణించారు. 

 


 ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ రామ్ చరణ్ తన పెద్ద మనసును చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న నూర్ అహ్మద్ కుటుంబాన్ని ఆదుకుని నిజమైన హీరో అనిపించుకున్నాడు రామ్ చరణ్. అయితే నూర్ మొహమ్మద్ మరణ వార్త విన్న మెగాస్టార్ చిరంజీవి తనను ఎంతగానో ఆరాధించే అభిమాని చనిపోయాడు అని తెలిసి.... వెంటనే నూర్ అహ్మఫ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. అంతేకాదు వారిని ఆర్థికంగా ఆదుకుంటామని కూడా భరోసా ఇచ్చారు.  నూర్ అహ్మద్ కుటుంబానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని అప్పట్లో ప్రకటించగా ఆ మాట నిలబెట్టుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈరోజు ఉదయం నూర్ మహమ్మద్ కుటుంబ సభ్యులను తన ఇంటికి పిలిపించుకుని రామ్ చరణ్ 10 లక్షల చెక్కును వారికి అందజేశారు. 

 

 

 ఈ సందర్భంగా మెగా అభిమాని నూర్ మొహమ్మద్ కుటుంబ సభ్యులతో మాట్లాడి న రామ్ చరణ్ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు  రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎప్పుడు మీ వెంటే ఉంటాం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏమైనా హీరోల  గురించి అభిమానులు ఏదో ఒకటి చేయడం చూస్తున్నాం... కానీ అదే అభిమానుల కోసం హీరోలు ఏకంగా ఆర్థిక సాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవడం  అంటే గొప్ప విషయమే కదా. నిజంగా రాంచరణ్ సినిమా లోనే కాదు రియల్ లైఫ్లో కూడా హీరో అనిపించుకున్నాడు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తున్నారు రామ్ చరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: