యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి రెండు సినిమాలు ఎంతో గొప్ప విజయాలు అందుకోవడంతో పాటు ఆ సినిమాలు నెలకొల్పిన రికార్డులు ఇప్పటికీ కూడా చాలా చోట్ల చెక్కుచెదరకుండా ఉన్నాయి అంటే, వాటి స్టామినా ఎటువంటితో అర్ధం చేసుకోవచ్చు. మన దేశం సహా పలు ఇతర దేశాల్లో కూడా కలెక్షన్ల దుమ్ము దులిపిన బాహుబలి రెండు భాగాల తరువాత, ప్రస్తుతం రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా ఆర్ఆర్ఆర్ అనే భారీ మల్టీస్టారర్ మూవీ ని తీస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. 

 

ముందుగా ఈ సినిమాని ఈ ఏడాది జులై 30న రిలీజ్ చేయాలని భావించిన సినిమా యూనిట్, సినిమాలోని కొన్ని సీన్స్ లో క్వాలిటీ టేకింగ్ విషయమై మరికొంత సమయం పడుతుందని, కావున సినిమాని 2021 జనవరి 8న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. నిజానికి బాహుబలి విజయాలు మన తెలుగు సినీ పరిశ్రమతో పాటు పలు ఇతర భాషల వారు ఎప్పటికీ మరిచిపోలేనివి అయినప్పటికీ కూడా, ఆర్ ఆర్ఆర్ సినిమాకు పోటీగా నిలుస్తాం అంటూ అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి టాలీవుడ్ అగ్ర నటులు సిద్ధం అవుతున్నట్లు కొన్ని టాలీవుడ్ వర్గాల టాక్. 

 

బన్నీ, సుకుమార్ ల కాంబో సినిమాతో పాటు, పవన్ కళ్యాణ్ క్రిష్ ల సినిమా కూడా రాబోయే సంక్రాంతి రేస్ లో నిలవనున్నట్లు చెప్తున్నారు. అయితే హిందీ సహా పలు ఇతర భాషల వారు మాత్రం ఆర్ఆర్ఆర్ ధాటికి తట్టుకోలేక తమ రిలీజ్ ల మార్పు విషయమై ఆలోచన చేస్తుంటే, మన టాలీవుడ్ వారు మాత్రం, కొంచెం కూడా భయం లేకుండా ఆర్ఆర్ఆర్ కు ఎదురెళ్తున్నారంటే, వారి సినిమాల పై వారికి ఉన్న నమ్మకం అర్ధం చేసుకోవచ్చని కొందరు అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై నిజానిజాలు వెల్లడికావలసి ఉంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: