ఒకప్పుడు సినిమాలంటే పేజీలు పేజీలు డైలాగులు... వాటిని కంఠస్థం చేసుకొని తూచా తప్పకుండా ఒకే షాట్లో చెప్పేవారు నాటి తరం హీరోలు. కానీ సినిమాకు పేజీలకు పేజీలు డైలాగులు అవసరం లేదు... ప్రేక్షకుల మదిని తాకే 4 పంచు డైలాగులు ఉంటే చాలు అని నిరూపించాడు త్రివిక్రమ్. పేజీలకు పేజీలు భారీ డైలాగ్ లతో సాగుతున్న తెలుగు ఇండస్ట్రీకి... చిన్న చిన్న పంచ్ డైలాగులతో నే ప్రేక్షకులను సంతృప్తి పరచవచ్చు అని నిరూపించి కొత్త ట్రెండ్ సృష్టించారు త్రివిక్రమ్. మాటలతో మాయ చేసి... డైలాగ్ ప్రేక్షకులను మెప్పించ గలడు. ఇప్పటి వరకు త్రివిక్రమ్ తీసిన ఏ సినిమా చూసినా పంచ్ డైలాగులకు ఎక్కువ ఉంటాయి. ఏ సినిమాలో కూడా... లెంతి  డైలాగులు కనిపించవు. ప్రేక్షకులు కూడా త్రివిక్రమ్ దగ్గర నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. 

 

 

 త్రివిక్రమ్ చేసిన సినిమాల్లో ఎన్నో పంచు డైలాగులు... ఆ పంచ్ డైలాగుల గురించి చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే. కేవలం కొన్ని పంచ్ డైలాగులతో నే సినిమాను నడిపించి సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా... అద్భుతంగా అలరించేలా తనదైన స్టైల్లో సినిమాను తెరకెక్కించడం  త్రివిక్రమ్ సొంతం. ఇప్పటికే సీనియర్ హీరోలతో పాటు జూనియర్ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా... స్టార్ హీరో తో వరుస సినిమాలు చేస్తున్నాడు త్రివిక్రమ్. 

 


 ఇక త్రివిక్రమ్ సినిమా వచ్చిందంటే అదొక పంచు డైలాగులు కొంబోలా  కనిపిస్తూ ఉంటుంది. అందుకే అటు ప్రేక్షకులు కూడా త్రివిక్రమ్ సినిమా అంటే పక్క ఎంటర్టెన్మెంట్ గ్యారంటీ అనే భావన లోనే ఉంటారు. టాలీవుడ్ డైరెక్టర్  లు అందరిలో త్రివిక్రమ్ శ్రీనివాస్కు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అటు హీరోలు కూడా త్రివిక్రమ్ సినిమాల్లో నటించేందుకు బాగా ఆసక్తి చూపుతుంటారు. ఎందుకంటే త్రివిక్రమ్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ సినిమా గా ఉంటుంది కాబట్టి. మొత్తంగా అయితే భారీ లెంత్  డైలాగులకు  స్వస్తి పలికి త్రివిక్రమ్ పంచ్ డైలాగ్లతో కొత్త ట్రెండ్ సృష్టించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: