బుల్లితెరపై మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ షోలకు సురేఖా వాణి యాంకరింగ్ చేశారు. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ రావడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు. సురేఖ వాణి తనదైన కామెడీ పండించండం మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల సినీ నటి సురేఖా వాణి భర్త సురేష్ తేజ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్. సురేష్ తేజ డైరెక్షన్లోనే మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ షోలతో ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు. ఇదే సమయంలో ఇద్దరి మద్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకున్నారు. టాలివుడ్లో కేరక్టర్ ఆర్టిస్ట్ సుపరిచితమైన నటి సురేఖావాణి, అటు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా సంచలనాలు సృష్టించింది.
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే సురేఖావాణికి నెటిజన్లలో మంచి క్రేజ్ ఉంది. సురేఖ వాణి కూతురు పేరు సుప్రీత.. ఈ అమ్మడు ఎక్కువగా సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటారు. గతంలో వీరిద్దరి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియా తెగ హల్ చల్ చేసింది. సుప్రీత ప్రస్తుతం చదువుకుంటునే, తన తల్లికి ఇష్టమైన సినీ రంగం వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు వెబ్ సీరీస్ లో కూడా నటిస్తోంది. ఆమె నటించిన కొన్ని ఎపిసోడ్స్ కూడా యూట్యూబ్ లో విడుదలయ్యాయి. అంతేకాకుండా టిక్ టాక్ లో వీడియోస్ చేస్తూ తనకంటూ మంచి క్రేజ్ ని కూడా సంపాదించుకుంది.
ఆ మద్య సుప్రిత హీరోయిన్ గా రాబోతుందా అన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయంపై సురేఖా వాణి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఇక సురేఖ వాణి అభిమానులు కూడా సుప్రీత హీరోయిన్ గా వస్తే బాగుండు అని అనుకుంటున్నారు. ఇప్పటికే నట వారసురాలుగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతూ పలువురు మంచి పేరు సంపాదించుకున్నారు. కాకపోతే ఈ విషయం మాత్రం ఇప్పటి వరకు అఫిషియల్ గా సురేఖా వాణి ఎక్కడా చెప్పలేదు.