టాలీవుడ్ సినిమా పరిశ్రమకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్య అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు సుకుమార్. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఆ సినిమా సూపర్ హిట్ కొట్టింది. ఆ విధంగా ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ అందుకున్న సుకుమార్, ఆ తర్వాత రామ్ హీరోగా జగడం అనే సినిమా తీసి ఫెయిల్యూర్ ని మూటగట్టుకున్నాడు. 

 

ఆపై మరొక్కసారి అల్లు అర్జున్ హీరోగా ఆయన తీసిన ఆర్య సీక్వెల్ అయిన ఆర్య 2 సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. అనంతరం కొంత గ్యాప్ తీసుకుని అక్కినేని నాగచైతన్య హీరోగా 100% లవ్ సూపర్ హిట్ సినిమా తీసిన సుకుమార్, దాని అనంతరం మహేష్ బాబు హీరోగా వన్ నేనొక్కడినే సినిమా తీశాడు. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా అప్పట్లో ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో, అలానే రామ్ చరణ్ తో తీసిన రంగస్థలం సినిమాలు దర్శకుడిగా సుకుమార్ ఖాతాలో హిట్స్ గా నిలిచాయి. 

 

అయితే మొదటి నుంచి సుకుమార్ దర్శకత్వ శైలి పరిశీలిస్తే మిగతా దర్శకుల కంటే ఒకింత వెరైటీ గా సాగుతుంది. ఎక్కువగా స్క్రిప్ట్ ను బేస్ చేసుకుని ఆసక్తికరంగా ఎమోషనల్ గా సినిమా ని ముందుకు తీసుకెళ్లడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు సుకుమార్. దానివలన తనకు మధ్యలో పరాజయాలు ఎదురైనప్పటికీ కూడా సుకుమార్ మాత్రం తన వే ఆఫ్ టేకింగ్ ని మాత్రం మార్చలేదు. ఇక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో ఒక సినిమాను తెరకెక్కిస్తున్న సుకుమార్ దానిని కూడా ఆకట్టుకునే కథ కథనాలతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది..... !!

 

మరింత సమాచారం తెలుసుకోండి: