వేణు తొట్టెంపూడి హీరోగా అప్పట్లో రిలీజ్ అయిన స్వయంవరం అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి కథ, మాటల రచయిత గా పరిచయమైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ తర్వాత పలు సక్సెస్ఫుల్ సినిమాలకు కూడా కథ మాటలు అందించి మంచి పేరు దక్కించుకున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం పరిశీలిస్తే, మిగతా రచయితలతో పోలిస్తే త్రివిక్రమ్ అందించే కథ తోపాటు డైలాగుల్లో ను కొంత హాస్య చతురత ఉంటుంది. ఆ తర్వాత తరుణ్ హీరోగా వచ్చిన నువ్వే నువ్వే సినిమా ద్వారా దర్శకుడిగా మారిన త్రివిక్రమ్

 

మొన్న అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో సినిమా వరకు కొన్ని హిట్స్ తో పాటు మరికొన్ని ఫ్లాప్స్ కూడా చవిచూశారు. ఇక ఆయన సినిమాల్లోని హీరో పలికే డైలాగుల్లో కొంత హాస్య చతురత తో పాటు వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించే డైలాగులు కూడా ఉంటాయి, నిజానికి అవే త్రివిక్రమ్ యొక్క టాలెంట్ కు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆ విధంగా పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తన అద్భుత దర్శకత్వ ప్రతిభతో ముందుకు సాగుతున్న త్రివిక్రమ్ కు టాలీవుడ్ మాటల మాంత్రికుడు అనే పేరు వచ్చింది. 

 

అలానే తన సినిమాల్లోని హీరోతో పాటు విలన్ ను కూడా ఒకింత వెరైటీ గా చూపించడంలో మంచి పేరు సంపాదించిన త్రివిక్రమ్ దర్శకత్వ శైలి గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. అందుకే టాలీవుడ్లోని చిన్న హీరో నుండి పెద్ద హీరో వరకు ప్రతి ఒక్కరు కూడా ఆయన సినిమాలో ఒక్కసారైనా నటించాలని కోరుకుంటూ ఉంటారు. ఇక ఇప్పటికే అరవింద సమేత, అలవైకుంఠపురములో వంటి రెండు వరుస విజయాలతో మంచి జోష్ మీదున్న త్రివిక్రమ్, అతి త్వరలో ఎన్టీఆర్ హీరోగా అయినను పోయి రావాలె హస్తినకు అనే సినిమాలో తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: