త్రివిక్రమ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ అయ్యి ఉండచ్చు.. కానీ ఒకప్పుడు సామాన్య వ్యక్తి.. ఎన్నో తిండి లేని రాత్రులు గడిపిన దర్శకుడు.. అలాంటి త్రివిక్రమ్ గురించి మనకు ఇప్పుడే తెలుసు.. కానీ సునీల్.. అదేనండి.. అప్పట్లో మనకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన కమెడియన్ సునీల్.. 

 

హీరోగా ఒక్క సినిమా హిట్ అవ్వగానే.. ఇంకా తాను స్టార్ హీరో అవుతాడు అనే ఆలోచనలో కొన్ని సినిమాలు తీసి ప్లాప్ ను మూటగట్టుకొని మల్టీ స్టార్ గా నటించి సినిమాను హిట్ తెచ్చుకున్నప్పటికీ హీరోగా ఛాన్సులు రాకా మళ్లీ కమెడియన్ గా నటించిన అద్భుత కమెడియన్ సునీల్ కు కెరియర్ స్టార్టింగ్ నుండే తెలుసు. 

 

ఎప్పుడు నుండి అనుకుంటున్నారా? ఇద్దరు సినీ ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తున్న సమయం నుండే త్రివిక్రమ్ కు సునీల్ ఒకే రూమ్ లో ఉండి ప్రయత్నాలు చేశారు.. అప్పటి నుండే ఒకరి కష్టాలు ఒకరు చూస్తూ.. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఎదిగారు.. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతి సినిమాల్లో మొదట్లో కమెడియన్ గా మంచి అవకాశాలు ఇచ్చాడు. 

 

నిజానికి ఆ సమయంలో సునీల్ కి త్రివిక్రమ్ సాయం కూడా అవసరం లేదు.. కారణం సునీల్ కామెడీ కోసం ప్రేక్షకులు అంతలా ఎదురు చూసేవారు.. ఇంకా దాని గురించి పక్కన పెడితే.. సునీల్, త్రివిక్రమ్ ఇప్పటికి మంచి స్నేహితులే.. గ్లాస్ మేట్స్.. రూమ్ మేట్స్.. కష్టాలు వస్తే ఇద్దరికీ ఇద్దరు తోడు ఉండే ప్రాణ మిత్రులు.. 

 

అందుకే ఏ చిన్న కష్టం ఎవరికీ వచ్చిన వీరు ఇద్దరు ఓ రూమ్ లోకి వెళ్లి మాట్లాడుకొని చెప్పుకుంటారు అని టాక్.. ఇకపోతే.. సునీల్ ప్రస్తుతానికి కమెడియన్ గా మళ్ళి రీఏంట్రీ ఇవ్వడంతో సునీల్ కి తన సినిమాల్లో మంచి అవకాశాలు ఇస్తున్నాడు త్రివిక్రమ్. అయినప్పటికీ సునీల్ కు అవి హిట్ అవ్వడంలేదు.. కానీ సునీల్ ని మళ్ళి కమెడియన్ గా మంచి ఫార్మ్ లోకి తీసుకురావడానికి త్రివిక్రమ్ అష్టకష్టాలు పడుతున్నాడు అని చెప్పచు. 

మరింత సమాచారం తెలుసుకోండి: