దిల్ రాజు.. తెలుగు ప్రేక్షకులు అందరికి తెలిసిన పేరు.. ఇతని పేరు తెలియని వారు ఉండరు.. నిర్మాతల్లో ఈయన పేరు వినిపించినట్టు మారే నిర్మాత పేరు వినిపించదు ఏమో.. ఎందుకంటే అయన ఎన్నో సినిమాలు నిర్మించాడు.. ఎప్పటి నుండి సినీ ఇండస్ట్రీని ఏలుతున్నాడు దిల్ రాజు. 

 

టాలీవుడ్ అగ్ర నిర్మాత అయినా దిల్ రాజుకు బిజినెస్ పరంగా అంత బాగున్నా.. తనకంటూ ఓ కుటుంబం లేకపోయే.. ఎందుకంటే తన భార్య రెండు సంవత్సరాల క్రితం మరణించారు. ఉన్న కూతురుకు పెళ్లి అయ్యింది.. ఆమెకు పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ దిల్ రాజు వయసు 50 సంవత్సరాలు. 

 

50 ఏళ్ళు వచ్చిన ముసలోడిలా అస్సలు కనిపించడు.. అలాంటి ఆహారాన్ని దిల్ రాజు తీసుకుంటాడు.. వ్యాయామాలు చేస్తాడు.. గ్లామర్ గా ఉంటాడు.. అయితే అలాంటి దిల్ రాజు ఇప్పుడు ఆరోగ్యం అసలు పట్టించుకోవడం లేదట.. ఎప్పుడు చూడు బిజినెస్ అనే బిజిలోనే ఉంటున్నారట.. వ్యక్తిగత జీవితాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదట.. 

 

ఇప్పుడు ఇది అంత పక్కన పెడితే.. ఆయనకు రెండో వివాహం అని ఆదివారం నుండి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దిల్ రాజు తన ఆరోగ్యం కోసం రెండో పెళ్లి చేసుకుంటున్నట్టు. ఆరోగ్యం దెబ్బతినకూడదు అంటే మ‌ళ్లీ పెళ్లి చేసుకోవాలని కూతురు, అల్లుడు, బంధువుల ఒత్తిడి తెస్తున్నటు వార్తలు వస్తున్నాయి. 

 

అయితే కూతురు అల్లుడు తెచ్చిన ఒత్తిడికి దిల్ రాజు ఒప్పుకున్నాడా? ఒకవేళ ఒప్పుకుంటే అమ్మాయి ఎవరు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో పుడుతున్నాయి.. ఒకవైపు కొందరు ఇలా ప్రశ్నిస్తుంటే మరికొందరు సంచలన కామెంట్స్ చేస్తున్నారు.. ఏం అని కామెంట్ చేస్తున్నారు అంటే? ఆరోగ్యం కోసం రెండో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అది కూడా ఈ వయసులో.. 'కేర్ టేకర్'ని పెట్టుకుంటే సరిపోదా 'దిల్ రాజు'? అంటూ ప్రశ్నిస్తున్నారు.. మరి కొందరు కామెంట్స్ చేస్తూ.. ప్రశాంతంగా ఉన్న జీవితంలోకి మళ్ళి సునామి అవసరమా దిల్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి దిల్ రాజు తుది నిర్ణయం ఏంటో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: