టాలీవుడ్ లో లక్కీ హీరో అని ఎవరంటే వెంటనే చెబుతారు విజయ్ దేవరకొండ అని.. ఎందుకంటే ఈ హీరో నటించిన సినిమాలు తక్కువే అయినా వరుస విజయాలు అందుకుంటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచేస్తున్నాడు.  యూత్ ఐకాన్ గా రౌడీ హీరోగా విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.  పెళ్లిచూపులు సినిమాతో సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ తర్వాత అర్జున్ రెడ్డి మూవీతో ఒక్కసారే స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.  ఇక గీతాగోవిందం, టాక్సీవాలా సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. 

 

గీతాగోవిందం సినిమాతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరాడు.  తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవ్ స్టోరీ మూవీ ఈ నెల 14 న  ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్ బిజీలో ఉన్నారు చిత్ర యూనిట్.  మొన్న ఆదివారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్ లో పాల్గొంటున్న విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఎన్నో విషయంలు ఈ సినిమాలో మూడు ప్రేమకథలు ఉంటాయి .. ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి.

 

గెటప్స్ పరంగా .. పాత్రల మధ్య వేరియేషన్స్ ను చూపించేపరంగా చాలా కేర్ తీసుకోవలసి వచ్చింది. గతంతో తన మూవీస్ గా కాకుండా కొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కించారని అన్నారు. అయితే ఈ మూవీలో ఓ ప్రేమికుడిగా ఎలా ఉండబోతున్నానో తెరపై చూసిన తర్వాత మీరే చెప్పాలని అన్నారు. అయితే  ఈ సినిమా చేయడానికి ముందు ప్రేమ అనేది ఒక నాన్ సెన్స్ అనుకున్నాను. కానీ ఈ సినిమా చేస్తున్నప్పుడు లైఫ్ లో ప్రేమ అనేది వుండాలనిపిం చింది. అప్పుడే లైఫ్ అందంగా సాగుతుందని అనిపించింది.  లైఫ్ లో ఎవరైనా ప్రేమలో పడతారు.. అది సాధించి ఆ అనుభూతి పొందిన వారే ఆనందిస్తారని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: