బాలీవుడ్ సినిమా పరిశ్రమలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ సంపాదించిన పేరు, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. కేవలం మన దేశంలోనే కాక పలు దేశ విదేశాల్లో కూడా బిగ్ బి కి ఎంతో మంది వీరాభిమానులున్నారు. ప్రత్యేకించి షోలే, జంజీర్, దీవార్, అగ్నీ పథ్, డాన్, ఆనంద్, తో పాటు ఇటీవల వచ్చిన పా, షమితాబ్, సర్కార్, పీకు, బ్లాక్ వంటి సినిమాల్లో ఆయన అత్యద్భుత నటనను మన ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు అనే చెప్పాలి. నటుడిగా ఎన్నో ఉన్నత శిఖరాలు, అవార్డులు, రివార్డులు అందుకుని బాలీవుడ్ మెగాస్టార్ గా కీర్తింప బడుతున్న అమితాబ్ బచ్చన్ సినీ జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే అది కెరీర్ పరంగా కాదు, సినిమా షూటింగుల సందర్భంగా ఆయన గాయాల పాలవడం వలన కలిగిన ఆరోగ్య సమస్యలు. 

 

ఆయన కొన్నేళ్ల క్రితం ఒక సినిమా షూటింగ్ లో ఉన్న సమయంలో అనుకోకుండా ఒక ఫైట్ సీన్ లో ఫైటర్ ఆయనను గట్టిగా కడుపులో గుద్దడంతో ఆయనకు కడుపు నొప్పి రావడం, ఆ తరువాత వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడం జరిగింది. ఇక ఆ ఘటన వలన ఇప్పటికీ కూడా కడుపు భాగంలో తనకు అప్పుడప్పుడు ప్రాణం పోయేంత నొప్పి వస్తుందని అమితాబ్ చెప్తుంటారు. ఇక అది మాత్రమే కాక, చాలా ఏళ్ళ క్రితం ఒక  సినిమా షూటింగ్ సమయంలో తన కాలికి గాయం అయిందని, అయితే షూటింగ్ జరుగుతున్న ప్రాంతం సిటీకి ఎంతో దూరంగా ఉండడంతో, అప్పటికే గాయంతో రక్తం విపరీతగా పోతుండడంతో స్థానిక డాక్టర్ సాయంతో దానికి చికిత్స అందించడం జరిగిందని, అయితే ఆ సమయంలో తనకు రక్తం కూడా ఎక్కించారట. కాగా ఆ రక్తంలో హెపటైటిస్ బి ఉందని, అయితే ఆ విషయం తనకు 20 ఏళ్ళ తరువాత తెలిసిందని, 

 

కానీ అప్పటికే తనకు జరుగవలసిన నష్టం అంతా జరిగిపోయి లివర్ దాదాపుగా 75% వరకు పాడయినట్లు డాక్టర్లు చెప్పారని అమితాబ్ అన్నారు. దానివలన మధ్యలో తనకు టిబి వ్యాధి సోకి ఎంతో దెబ్బతిన్నానని, కావున ప్రస్తుతం తాను కేవలం 25% లివర్ తో మాత్రమే జీవిస్తున్నానని అమితాబ్ ఇటీవల ఒక టెలివిజన్ షో లో ఈ షాకింగ్ విషయం చెప్పారు. ఇక అప్పటి నుండి ఈ విషయం తెలుసుకున్న బిగ్ బిగ్ ఫ్యాన్స్, ఆయన ఆరోగ్యం కుదుటపడి ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆయనకు గెట్ వెల్ సూన్ సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఈ వార్త ఆయన ఫ్యాన్స్ తో పాటు యావత్ ప్రేక్షకలోకానికి గుండెను బద్దలు చేసే వార్తే అని చెప్పాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: