టాలివుడ్ అగ్ర దర్శకుల్లో రాజమౌళి ఒకరు. టాలివుడ్ అనే కాదు గాని బాహుబలి తర్వాత ఆయన రేంజ్ అమాంతం పెరిగి పోయింది అనే చెప్పుకోవచ్చు. బాహుబలి రెండో భాగం చూసిన తర్వాత హాలివుడ్ దర్శకులు కూడా చిరు నవ్వు  నవ్వారు. ఆ సినిమా భారీ విజయం తర్వాత రాజమౌళి తన తదుపరి సినిమా ఎవరితో చేస్తారు అనేది చాలా రోజుల వరకు స్పష్టత రాలేదు. ఆ తర్వాత చాలా రోజులకు గాను, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 

 

2017 లో బాహుబలి సినిమా వచ్చింది. ఈ సినిమాకు దాదాపు నాలుగేళ్ళు తీసుకుంటున్నాడు. 2017 నుంచి వచ్చే ఏడాది వరకు చూసుకుంటే నాలుగేళ్ళు అవుతుంది. దీనితో ఇప్పుడు రాజమౌళిపై అతని ఫాన్స్ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే రాజమౌళి దర్శకుడు అయితే చాలు ఏ హీరోతో సినిమా చేసినా సరే హిట్ అవుతుంది అనే భావన అభిమానుల్లో ఉంది. దీనితో అతనికి హీరోతో సమానంగా ఇమేజ్ వచ్చింది అనే చెప్పుకోవచ్చు. అందుకే అతని ఫాన్స్ రాజమౌళి మీద ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. 

 

సినిమా సినిమాకు నాలుగేళ్ళు తీసుకుంటే, అటు ఆయన పని చేసే హీరోల సినిమాలు రావు, ఇటు రాజమౌళి సినిమాలు రావు. ఆయన ఒక సినిమా చేసేలోపు ఇతర దర్శకులు నాలుగు సినిమాలు చేస్తున్నారు. రాజమౌళి తారక్ తో సినిమా ఓకే చేసిన తర్వాత త్రివిక్రమ్ రెండు సినిమాలు చేసాడు. మూడో సినిమాకు కూడా రెడీ అవుతున్నాడు. దీనితో ఇన్నాళ్ళు సినిమా అయితే ఎలా అనే భావన జక్కన అభిమానుల్లో ఉంది. అలా అని సినిమాను తీసిపారేయలేరు. సినిమా రావడమే ఒక పండగగా ఉంటది. ఆర్ఆర్ఆర్ సినిమా జూన్ అన్నారు, దసరా అన్నారు, ఇప్పుడు జనవరి అంటున్నారు. ఇక ముందు జక్కన్న మారాలని, ఇంత లేట్ అయితే కష్టమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: