ఎప్పుడూ ఏదోక విమర్శ చేస్తూ సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో కూడా వార్తల్లో ఉంటూ ఏదోక సంచలనానికి వేదికగా మారుతున్నాడు ఈ సిని క్రిటిక్. దర్శకుడిగా చేసే సినిమాలు లేకపోవడమో లేక మరేదైనా కారణమో తెలియదు గాని ఆయన కాస్త నోరు అదుపులో లేకుండా మాట్లాడుతున్నారు అనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో కాస్త పాపులారిటి రావడం లేదా, వార్తా పత్రికలూ, వెబ్ సైట్స్ తనను మర్చిపోయాయి అనుకున్న సమయంలో నోటికి పని చెప్తున్నాడు. 

 

తాజాగా రాముడిపై అతను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి. రాముడు తిరుగుబోతు, అమ్మాయిలతో సరసం చేసాడని మాట్లాడిన మాటలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై హిందుత్వ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అతన్ని అరెస్ట్ చెయ్యాలని, కేసు నమోదు చేసి లోపల పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. అసలు రాముడి గురించి అతనికి ఎం తెలుసు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పరిస్థితులు అదుపులో ఉండవు అంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు పలువురు.

 

తాజాగా ఐమాక్స్‌ థియేటర్ కు విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకు కత్తి మహేష్ వచ్చాడు. ఈ సందర్భంగా ఆయనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన వస్తున్న విషయం తెలుసుకున్న కొందరు అక్కడికి వచ్చి ఆయన కోసం కాచుకుని కూర్చుని దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు కూడా పగిలాయి. కాసేపు ఉంటే పరిస్థితి మరోలా ఉండి ఉండేదని అక్కడ చూసిన వాళ్ళు అంటున్నారు. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని అక్కడి నుంచి పంపించడంతో తప్పించుకున్నాడు. దీనితో గొడవ అక్కడ ముగిసింది .గతంలో కూడా కోడి గుడ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: