జూనియర్ ఎన్టీఆర్.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో ఒకడు. వెండి తెర‌కు హీరోగా ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టి నుంచీ ఎంతో క‌ష్ట‌ప‌డి ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్య‌క‌గుర్తింపు ఏర్ప‌ర్చుకున్నారు. నందమూరి తారక రామారావును గుర్తు చేసేలా ఉండే ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం దూకుడు మీద ఉన్నాడు. కొన్నేళ్లుగా వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాడు. అలాగే నటన, డ్యాన్స్‌లు, డైలాగ్ డెలివరీ, ఎమోషన్, ఫైట్స్, సింగ‌ర్‌గా ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 

ఈ క్ర‌మంలోనే తెలుగు ఇండస్ట్రీలో భీభత్సమైన మాస్ ఫాలోయింగ్ క్రియేట్ అయింది. అంతేకాదు ఎన్టీఆర్ అంటే ప‌వ‌ర్‌స్టార్‌కు వీరాభిమానం. ప‌వ‌ర్‌స్టార్ అంటే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాదండోయ్‌.. క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌. కన్నడలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, మంచి హ్యూమన్ బీయింగ్ వున్న కొంతమంది హీరోలలో పునీత్ రాజ్ కుమార్ ఒకరు. ఈయ‌నకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. అలాగే పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన ‘చక్రవ్యూహ’ సినిమాలో యంగ్‌టైగర్ కూడా ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్  ‘గెలయా... గెలయా.. గెలువే నమదయ్యా’ అంటూ సాగే ఈ గీతం ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటుంది.

 

ఈ పాటకు మంచి రెస్పాన్స్ కూడా వ‌చ్చింది. కాగా, గతంలో కొన్ని సినిమాల్లో సాంతంగా పాట పాడిన ఎన్టీఆర్.. రభస సినిమాలో పాడిన 'రాకాసి రాకాసి' అనే పాట మంచి గుర్తింపు తెచిపెట్టింది. మ‌రియు ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో' సినిమాలోని 'ఫాలో ఫాలో సాంగ్ అయితే ఒక సెన్సేషన్ అయింది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ తన సింగింగ్ ట్యాలెంట్ ని ఇలా కన్నడ ప్రేక్షకులకు రుచి చూపించి సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్' అనే చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఇందులో తారక్.. కొమరం భీంగా కనిపించనున్నాడు.

 
 
 

 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: