యాంకర్ ప్రదీప్ ... బుల్లితెరమీద పాపులర్ మేల్ యాంకర్ గా అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ప్రదీప్ కొన్నాళ్ళు ఆర్.జే గా పని చేశాడు. కెరీర్ మంచి పీక్స్ లోకి వెళుతున్న సమయంలో అక్కడ పాలిటిక్స్ భరించలేక బయటకు వచ్చేశాడు. చాలా రోజులు నానా అవస్థలు పడి టే యాంకర్ గా ఒక టీవీ షో లో అవకాశం సంపాదించుకున్నాడు. కేవలం ఆడాళ్ళు మాత్రమే పాల్గొనే ఆడాళ్ళా మజాకా అన్న షో కి ప్రదీప్ ని యాంకర్ గా తీసుకున్నాడు. ఈ షోలో చేస్తున్నప్పుడు పాపం ప్రదీప్ కొంతమంది అనరాని మాటలన్నారట కూడా. ఆ మాటలని ప్రదీప్ చెప్పుకోలేక చాలా బాధపడేవాడట. కానీ లైఫ్ లో సక్సస్ అవ్వాలని వాటన్నిటిని భరించి చాలా కష్టపడ్డాడు. అంతమంది ఆడాళ్ళ మధ్యన ఉండి షో చేయడం పెద్ద టాక్స్ అని చెప్పాలి. కాని ప్రదీప్ సక్సస్ అయ్యాడు. ఆ షో జనాలలో విపరీతమైన క్రేజ్ ని తిసుకు వచ్చింది. 

 

ముఖ్యంగా ప్రదీప్ కి మేయిల్ యాంకర్ గా పిచ్చ పాలులారిటీ వచ్చింది. అంత మంది అందమైన ఆడవాళ్ళు ఉన్నా కూడా అందరూ ప్రదీప్ బిహేవియర్ కి ఆ యాటిట్యూడ్ కి అట్రాక్ట్ అయ్యారు. షో గ్రాండ్ సక్సస్ అయింది. ఆ దెబ్బతో ప్రదీప్ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేకుండా పోయింది. మల్లేమాల వంటి పెద్ద ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న పాపులర్ టీవీ షో ఢీ కి హోస్ట్ చేయడం నిజంగా ప్రదీప్ కెరీర్ లో పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ షో లో ప్రదీప్ చాలా హైలెట్ అయ్యాడు. ప్రదీప్ లేకపోతే షో చూడలేము అన్నంతగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు.

 

అలా వరుసగా పెద్ద ఛానల్స్ లో పాపులర్ షోస్ చేస్తున్న ప్రదీప్ అప్పుడప్పుడు కాంట్రవర్సీలను ఎదుర్కొంటున్నాడు. డ్రంక్ అండ్ డరివ్ కేసు సహా మరికొన్ని వాటితో ప్రదీప్ పేరు కి కాస్త బ్యాడ్ వచ్చి చేరింది. ఇదిలా ఉంటే టీవీ షోస్ తో ఇంత బిజీగా ఫేం ని సంపాదించుకున్న తన సొంత ప్రొడక్షన్స్ లో కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే సెలబ్రిటీ గేం షో తో సక్సస్ ఫుల్ గా మూడు సీజన్స్ తో లరించాడు. ఇదంతా బావుండగానే ఇప్పుడు హీరో అవబోతూ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. వాస్తవంగా టీవీ నుండి వచ్చిన వాళ్ళు సిల్వర్ స్క్రీన్ మీద రాణించలేదు. 

 

అలా ఫేయిల్ అయిన వాళ్ళని చాలామందినే చూశాము. ఇప్పుడు ప్రదీప్ కూడా హీరో అవ్వాలన్న కుతూహలంతో అదే తప్పు చేస్తున్నాడు. దీంతో చాలామందికి ప్రదీప్ మీద కోపం వస్తోందట. అంతేకాదు అసలు ప్రదీప్ హీరో అవడం ఇష్టం లేదని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అనవసరంగా హీరో వేశాలేసి కెరీర్ నాశనం చేసుకుంటాడేమోనని డబుల్ మీనింగ్ డైలాగులు చెబుతుంటే షో కదా అనుకున్నాము ప్రదీప్ .. నీలో ఈ వేశాలు కూడా ఉన్నాయనుకోలేదు ..అంటూ కొంతమంది ప్రదీప్ ఫ్యాన్స్ నిర్మొహమాటంగా అంటున్నారట. మరి నిజమేగా ప్రదీప్.. నీకవసరమా ఈ హీరో వేశాలు చెప్పు. 

మరింత సమాచారం తెలుసుకోండి: