యంగ్ టైగర్ ఎన్టీఆర్... ప్రస్తుతం టాలివుడ్ లో టాప్ హీరో. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు అభిమానుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో టాలివుడ్ లో ఈ రేంజ్ మల్టీ స్టారర్ సినిమా రాలేదు అనేది వాస్తవం. దీనితో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు  జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు . వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తుంది.

 

జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చి ఇప్పటికి రెండు ఏళ్ళు అవుతుంది. దీనితో ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా నందమూరి కుటుంబాల నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పై సిని విశ్లేషకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక అది అలా ఉంటే ఈ వారం జూనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా వార్తలు రాకపోయినా ప్రస్తుతం చేస్తున్న సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర గురించే ఎక్కువగా చర్చ జరుగుతుంది. అసలు ఆ పాత్ర కోసమే సినిమాను ఆలస్యం చేసినట్టు సమాచారం. 

 

సినిమా తర్వాత తారక్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తాడని అంటున్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం ఈ సినిమా కథను సిద్దం చేసే పనిలో ఉన్నాడు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ కూడా ఉండే అవకాశం ఉందని టాక్ వినపడుతుంది. ఇది ఎంత వరకు నిజమో తెలియకపోయినా రాజకీయ నేపధ్యంలో ఈ సినిమా ఉండే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఎన్టీఆర్ ఒక మంత్రి పాత్రలో నటించే అవకాశం ఉందని అంటున్నారు. దీనితో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా జూలై నుంచి సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: