సౌత్ లో స్టార్ హీరోయిన్స్ కి ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా తమ అందాలని చూపించడానికి, అందరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలబడటానికి అని ఎదురు చూస్తుంటారు. బాలీవుడ్ హీరోయిన్స్ అయితే మరీ ఎక్కువగా ఈ విషయంలో తాపత్రయపడతారు. అందరి దృష్ఠిలో పడి గొప్ప ప్రశంసలను అందుకోవడంతో పాటు ఇదే అదునుతో మేకర్స్ ని ఆకట్టుకోని అవకాశాలు అందిపుచ్చుకోవాలని చూస్తుంటారు. ఇక ఫిలింఫేర్ అవార్డ్స్ 2020లో ఆలియా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రాజీ - ఉడ్తా పంజాబ్ తర్వాత 'గల్లీ బాయ్' సినిమాలో నటనకు ఉత్తమ నటిగా మరోసారి అవార్డును కైవసం చేసుకుంది. ఇక ఈ వేదికపై బాలీవుడ్ హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా.. ఆలియా లుక్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పసుపు - పింక్ కాంబినేషన్ డిజైనర్ డ్రెస్ లో ఆలియా మెరుపులు మెరిపించింది.

 

కేవలం నటనలోనే కాదు.. ఫ్యాషన్ అండ్ స్టైల్ కంటెంట్ లో తనని కొట్టేవాళ్లు లేరని ప్రూవ్ చేసింది మరోసారి. కరణ్ జోహార్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' (2012) సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన అలియా భట్ తన తోటి హీరోయిన్స్ తో పోటీ పడి తనేంటో నిరూపించుకుంది. 2018లో విక్కీ కౌషల్ సరసన నటించిన 'రాజీ' బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. ఈ సినిమాలో ఆలియా నటనకు ఉత్తమనటిగా ఫిలింఫేర్ ను సొంతం చేసుకుంది. రాజీ తన కెరీర్ కి టర్నింగ్ పాయింట్ సినిమా అని చెప్పాలి. ఇక ఆలియా ప్రస్తుతం 2020 మోస్ట్ అవైటెడ్ సినిమా ఆర్.ఆర్.ఆర్ లో రాం చరణ్ సరసన నటిస్తోంది. అలాగే అయాన్ ముఖర్జీ 'బ్రహ్మాస్త్రా' సినిమాలో రణబీర్ కపూర్- అమితాబ్ బచ్చన్- మౌని రాయ్ - అక్కినేని నాగార్జున వంటి అగ్రతారాగణంతో కలిసి నటిస్తోంది.

 

సినిమా 2020 డిసెంబర్ లో థియేటర్లలోకి రానుంది. ఇక మహేష్ భట్ తెరకెక్కిస్తున్న 'సడక్ 2' లో ఆదిత్య రాయ్ కపూర్- పూజా భట్ -సంజయ్ దత్ లతో కలిసి నటిస్తోంది. కరణ్ జోహార్ తక్త్ లోనూ ఆలియా నటించడం విశేషం. ఈ సినిమాలో రణవీర్ సింగ్- కరీనా కపూర్ ఖాన్- అనీల్ కపూర్- జాన్వీ కపూర్- భూమి పెడ్నేకర్ -విక్కీ కౌషల్ నటిస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ సంచలన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'గంగూబాయి కతియావాడీ' సినిమాలోను నటిస్తోంది. అయితే ఫిలింఫేర్ అవార్డ్స్ అవార్డ్ లో మెరిసిన ఆలియాను వర్మ హీరోయిన్ లా హాట్ గా ఉందని కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: