ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి వస్తున్న నటీనటులు చేస్తున్న సినిమాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. దానికి కారణం ఎప్పటికప్పుడు కొత్తగా హీరోలు, హీరోయిన్లు పుట్టుకురావడమే. ఒకప్పటిలా కాకుండా ఏవో మూడు, నాలుగు సినిమాలు చేసిన తరువాత కొందరు హీరోయిన్లు అయితే అంతు పంతు లేకుండా పోతున్నారు. ఇక ఆ విధంగా హీరోయిన్లు తక్కువ సినిమాలకే కనుమరుగు అవడానికి కారణం, వారు అందంపై కొంత శ్రద్ధ తీసుకోకపోవడమే అనే విమర్శ కూడా టాలీవుడ్ లో ఉంది. అక్కడక్కడా కొన్ని సినిమాలు చేసిన తరువాత మెల్లగా సినిమాలు తగ్గించి తమ పెళ్లి, ఫ్యామిలీ పై దృష్టి పెడుతున్న హీరోయిన్స్, ఆపై గ్యాప్ తీసుకుని మళ్ళి రీఎంట్రీ ఇవ్వాలంటే మాత్రం ఎంతో ఇబ్బందులు పడవలసి వస్తోంది. 

 

ఇక ఆ విధంగా కొన్నేళ్ల క్రితం ఒక యూత్ఫుల్ హిట్ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ, ఆ తరువాత అక్కడక్కడా కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి సక్సెస్ లు అందుకుంది. ఆ తరువాత పెళ్లి చేసుకుని గుర్తుపట్టలేనంత బొద్దుగా తయారయింది. అయినప్పటికీ ఇటీవల ఒక స్టార్ హీరో సరసన ఆమెకు సెకండ్ హీరోయిన్ రోల్ దక్కడం, ఆ సినిమా కూడా హిట్ కావడం జరిగింది. ఇక ఇటీవల మాత్రం మళ్ళి అవకాశాలు తగ్గడంతో, మళ్ళి తన పూర్వం మాదిరిగా సన్నగా నాజుగ్గా తయారవడానికి కసరత్తులు మొదలెట్టిందట. 

 

అలా సన్నగా నాజూగ్గా ఉంటేనే గానీ మళ్ళి అవకాశాలు అందుకోలేం అని భావించి, ఇప్పటికే కొంత కూడా వెయిట్ తగ్గింది. ఇక ఇటీవల ఒక ఫంక్షన్ లో మెరిసిన సదరు హీరోయిన్ ని, అవకాశాల కోసం పాపం మీరు ఎన్నో పాట్లు పడుతున్నట్లున్నారు, నిజమేనా అంటూ కొందరు మీడియా వారు ప్రశ్నించగా, మీకు ఏమి తెలుసని మాట్లాడుతున్నారు, ఆఖరికి తప్పనిసరిగా మనసు చంపుకుని బరువు తగ్గడం కోసం తిండి పూర్తిగా తగ్గించడంతో పాటు వ్యాయామాలు చేయలేక నానా అవస్థలు పడుతున్న నా బాధ మీకు తెలుసా, ఛ అసలు నా పరిస్థితి మీకు అంత కామెడీ గా ఉందా అంటూ వారిపై ఒకింత ఫైర్ అవుతూ ఆ హీరోయిన్ మాట్లాడినట్లు టాక్. అయితే ఎవరి బాధలు వారివి కదా, ఆమె పాట్లేవో ఆమె పడుతోంది అంటూ ఆమె విషయమై కొంత జాలి పడుతున్న వారు కూడా ఉన్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: