పవన్ కళ్యాణ్ భూమిక కాంబినేషన్ ప్రతి ఒక్కరికి గుర్తు ఉండే ఉంటుంది... ఆ సినిమా ఖుషి.. ఆ సినిమా చుసిన ప్రతిసారి ఇప్పుడే చుసిన ఫీల్ కలుగుతుంది.. అంత అద్భుతంగా ఈ సినిమా ఉంది. అయితే ఈ సినిమాలో అప్పట్లో సెన్సషనల్ హిట్ కూడా అయ్యింది. ఇంకా భూమిక.. పవన్ కళ్యాణ్ మధ్య ప్రేమ, రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంది. 

 

సినిమాలో పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్.. భూమిక అతి కోపం.. ఇద్దరి మధ్య సంభాషణ అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఈ సినిమాలో ఈ హిట్ పెయిర్ ఇప్పుడు మళ్ళి కలిసి నటించనున్నారు. అంటే ఎవరైనా సరే.. వావ్.. ఈ పెయిర్ మళ్ళి కలిసి నటిస్తుందా? అయితే సూపర్ హిట్ అవుతుంది అని అభిమానులు కూడా అనుకుంటారు. 

 

కానీ ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. ఖుషి సినిమా ఈ మధ్య రాలేదు.. ఎప్పుడో 19 ఏళ్ళ క్రితం 2001లో వచ్చింది. అంటే దాదాపు 19 సంవత్సరాలు.. ఒక హీరోయిన్ అదే అందం అయితే మెయింటైన్ చెయ్యలేదు.. ఒకవేళ చేసిన ఆమెకు పెద్దగా అవకాశాలు ఏమి ఇవ్వరు.. 

 

ఇంకా భూమిక విషయం వస్తే..  ఆమె కెరీర్ పరంగా కొద్ది గ్యాప్ తీసుకుంది.. 2007లో సినిమాలకు గుడ్ బై చెప్పిన ఆమె.. కొంతకాలం నటనకు దూరమై 2016లో ధోని సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా కాదు.. హీరో అక్కలా ఆమె రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఆతర్వాత కొన్ని సినిమాల్లో నటించిన పెద్దగా పేరు రాలేదు.. 

 

నానితో 'మిడిల్ క్లాస్ అబ్బయి', సమంతతో యు-టర్న్, నాగ చైతన్యతో సవ్యసాచి, ఇంకా బాలయ్య రూలర్ సినిమాలో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయనున్నట్టు.. ఆ సినిమా కోసం డైరెక్టర్ క్రిష్ ఆమెను కలిసినట్టు.. ఆమె ఆ సినిమా కోసం ఒప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

 

మరి ఈ సినిమాలో భూమిక ఎలాంటి రోల్ చేయనుంది? సినిమా హీరోయిన్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే ఆమె వయసు 41 ఏళ్ళు కాబట్టి.. పవన్ కళ్యాణ్ కూడా ముసలోడు అయినప్పటికీ అయన మగజాతి ఆణిముత్యం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయనకు యువ హీరోగా అవకాశాలు వస్తాయి.. మరి ఈ యువ వృద్ధుడు పవన్ కళ్యాణ్ సరసన.. భూమిక ఏ రోల్ చేయనుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరి భూమిక పవన్ కళ్యాణ్ సరసన ఏ రోల్ చేయనుంది ? ఇది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: