టాలీవుడ్ లో చిన్న చిన్న సినిమాల్లో నటుడుగా వస్తున్న శర్వానంద్ ప్రస్థానం మంచి పేరు తీసుకు వచ్చింది.  సంక్రాంతి, 'లక్ష్మి' సినిమాల్లో వెంకటేష్ తమ్ముడిగా చేశాడు. 'రాజు మహారాజు'లో మోహన్‌బాబుతో కలిసి నటించాడు.  చిరంజీవి నటించిన  'శంకర్ దాదా ఎంబీబీఎస్'లో మరో పాత్ర.  ఇలా చిన్న పాత్రల్లో నటించిన శర్వానంద్ కి raja RUN' target='_blank' title='రన్ రాజా రన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రన్ రాజా రన్ సినిమాతో హీరోగా మంచి అదృష్టం కలిసి వచ్చింది. శర్వానంద్ కెరీర్ లో 'అమ్మ చెప్పింది'లో మానసికంగా ఎదగని కుర్రాడి పాత్ర. ఈ  సినిమాతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.  'గమ్యం'తో ఇతని నట జీవితం టర్న్ అయ్యింది.  శతమానం భవతి సినిమాతో శర్వానంద్ కి ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. 

 

ఒక్కో సినిమా హిట్ తో హారోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న శర్వానంద్ ఈ మద్య జాను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ సినిమా తమిళం, కన్నడంలో హిట్ అయిన   ‘96’ సినిమాకు రీమేక్.  తాజాగా ఈ మూవీ కి సంబంధించి కొన్ని విషయాలు శర్వానంద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.  96 మూవీ క్లాసిక్ మూవీ కదా .. చేయగలనా? అనుకున్నాను. పైగా విజయ్ సేతుపతితో పోల్చి చూసి ట్రోల్ చేస్తారేమోననే సందేహం కూడా కలిగింది. ఇక సమంతతో కలిసి నటించడం సామాన్యమైన విషయం కాదు. ఆమె స్థాయికి తగినట్టుగా చేయగలనా? అని కూడా ఆలోచించాను. ఈ విషయాలను గురించే నేను 'దిల్' రాజుగారితో మాట్లాడాను. అయితే 'నన్ను నమ్ము' అని ఆయన అన్నారు. 

 

శర్వానంద్.. సమంత జంటగా మాతృక దర్శకుడు ప్రేమ్ కుమారే ఈ మూవీ కూడా రూపొందించాడు. తమిళంలో మాదిరే ఇక్కడా ఈ మూవీ మ్యాజిక్ క్రియేట్ చేస్తే...అంచనాలు తారుమారు చేస్తూ ప్లాఫ్ అయ్యి కూర్చుంది. కలెక్షన్స్ వైజ్ గా డిజాస్టర్ దిసగా ప్రయాణం పెట్టుకుంది. దిల్ రాజు దీన్ని లైట్ తీసుకున్నా, శర్వానంద్ మాత్రం సీరియస్ గానే ఈ రిజల్ట్ ని తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన చేసే సినిమాలో ఆచీ తూచీ నిర్ణయం తీసుకొని చేయబోతున్నారట. విషయం ఏంటేంటే ఇప్పటి వరకు ఏ మూవీకి సైన్ కూడా చేయలేదని ఫిలిమ్ వర్గాల్లో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: