ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ని అడవుల్లో చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. జనవరి 8న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుంది. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఏ రికార్డులను నమోదు చేస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ కావడంతో సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ పెరిగిన సంగతి తెలిసిందే. దీనితో ఆయన సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా ఆయన సినిమాలు అనగానే ఒక క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు అదే ఇతర దర్శకులను ఇబ్బంది పెడుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అవుతుంది అనగానే, ఈ సినిమాకు దగ్గరలో ఏ సినిమా విడుదల చేయకూడదని భావిస్తున్నారట. ఈ సినిమా ముందు జూలై లో అన్నారని దసరాకు కొన్ని సినిమాలు విడుదల చెయ్యాలని భావించారు. 

 

అయితే అనూహ్యంగా ఈ సినిమా మళ్ళీ ఆ సమయానికి మారడంతో కొందరు వెనక్కు తగ్గారు. దసరాకు విడుదల చేసే సినిమాలను సంక్రాంతికి విడుదల చేసారు. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాను సంక్రాంతికి అనడంతో సంక్రాంతికి విడుదల చెయ్యాలి అనుకున్న వాళ్ళు దసరాకు మారిపోయారు. ఆ సినిమా దాదాపు అన్ని థియేటర్స్ లో ఆడుతుంది కాబట్టి తమ సినిమాలను ఎవరూ చూడరు అనే భావనలో ఉన్నారు దర్శకులు. అందుకే సినిమాలను ఆలస్యంగా విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: