ప్రస్తుతం తెలుగు కన్నడ ఇండస్ట్రీలలో ఎంతగానో క్రేజ్ సంపాదించిన హీరోయిన్ రష్మిక మందన. ప్రస్తుతం ఈ రెండు ఇండస్ట్రీలలో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇక అంతే కాకుండా ఎంతోమంది అభిమానుల కూడా సంపాదించుకుంటుంది ఈ అమ్మడు. తెలుగు చిత్ర పరిశ్రమకి చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో చేసిన గీత గోవింద సినిమాతో  తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. క్రమక్రమంగా సినిమాలు చేసుకుంటూ వచ్చిన రష్మిక మందన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. ఇక మొన్నటికి మొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన చాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. 

 


 మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన సినిమాలో నటించిన రష్మిక మందన సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నది . ఇక ఇప్పుడు తెలుగులో వరుసగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ సహా పలు అగ్ర హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ అమ్మడి దక్షిణాది సినిమాల్లో ఎంతో డిమాండ్ వుంది అనే చెప్పాలి. ఇకపోతే మామూలుగా సెలబ్రిటీలకు కొన్ని కొన్నిసార్లు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రష్మిక మందన కు కూడా ఓ చేదు అనుభవం ఎదురైంది. తాజాగా రష్మిక మదన ఈవెంట్ కు హాజరైన సందర్భంగా ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ దిగడానికి వచ్చి ఆమెను గట్టిగా ముద్దు పెట్టుకుని పారిపోయాడు. 

 


 ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కాగా ఆగంతక అభిమాని చేసిన పనికి రష్మిక మందన అవాక్కయి పోయారు. అక్కడున్న జనాలకు కూడా ఏం జరిగిందో తెలుసుకునే లోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. కాగా రష్మిక మందన ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన నిర్వాహకులు ఈ విషయంపై లోకల్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం తో  పోలీసులు సదరు వీడియో ను పోలీసులు నెట్టింట్లో డిలీట్ చేశారు. హీరోయిన్లకు ఇలాంటి ఇబ్బందులు కొత్తేమీ కాదు పలుమార్లు ఎంతో మంది హీరోయిన్లకు అభిమానులు అత్యుత్సాహం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: