ఇన్నర్ వేర్ యాడ్స్... ఈ మధ్య హీరోయిన్లను ఎక్కువగా ఆకట్టుకుంటున్న యాడ్స్. డబ్బుకి డబ్బు, పేరుకి పేరు రావడమే కాకుండా అభిమానుల సంఖ్య పెరగడంతో అవకాశాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ఇన్నర్ వేర్ యాడ్స్ గతంలో హీరోయిన్లు చేసే వాళ్ళు గాని బాలీవుడ్ లో యువ హీరోయిన్ దిశా పటాని చేసే వరకు కూడా చాలా మందికి వాటి గురించి అంత ఐడియా లేదనే చెప్పాలి. ముఖ్యంగా దిశా పటాని సోషల్ మీడియా లో పోస్ట్ చేసిన కొన్ని ఫోటో లు చూసి అభిమానులకు మైండ్ పోయింది అంటే ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. 

 

ఇప్పుడు అదే బాటలో వెళ్తుంది టాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న పునర్నవి భూపాలం. బిగ్ బాస్ 3 తో కాస్త తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ గుంటూరు అమ్మాయి, ఇప్పుడు అవకాశాల కోసం ఇన్నర్ వేర్ యాడ్స్ చెయ్యాలని చూస్తుంది. ఇటీవల కెల్విన్ క్లెయిన్ ఇన్నర్ వేర్ ధరించి సోషల్ మీడియా లో ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ఒక రేంజ్ లో వైరల్ అయింది.  ఆ తర్వాత ఈమెతో ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడినట్టు తెలుస్తుంది. తాను ఆ యాడ్ చేయడానికి సిద్దంగా ఉన్నా అని చెప్పింది ఈ భామ. 

 

దానికి కారణం ఏంటీ అంటే ఆ యాడ్ తో ఆమె అందాలను ఆరబోసే ఛాన్స్ ఉంటుంది. వరుస అవకాశాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనితోనే పునర్నవి ఆ యాడ్ కోసం గట్టిగా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తనకు యాంకర్ గా అవకాశాలు కావాలని ఆమె ఒక దర్శకుడిని కూడా అడిగినట్టు సమాచారం. ఈ నేపధ్యంలోనే ఆ యాడ్ వస్త తనకు దశ తిరుగుతుంది అని గ్లామర్ పాత్రలు వచ్చే అవకాశం ఉంటుంది అని పునర్నవి భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: