ఈ మధ్య సినిమాల్లో కాస్త లిప్ లాక్స్ ఎక్కువయ్యాయి. వాటికి ప్రేక్షకుల ఆదరణ కూడా ఉన్న నేపధ్యంలో దర్శకులు కథ రాసుకునే సమయంలోనే వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. దాదాపు అన్ని సినిమాల్లోనూ ఇది ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ లో ఈ ట్రెండ్ గతంలో తక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం అది ఎక్కువైపోయింది. బాలీవుడ్ లో ఆ ట్రెండ్ హిట్ అవ్వడంతో ఇప్పుడు టాలీవుడ్ లో కూడా దర్శక నిర్మాతలకు వాటి కోసం ఆసక్తి చూపిస్తున్నారు. అది సినిమాకు కమర్షియల్ హంగులు తెస్తుంది. 

 

ఇక ఒక్క లిప్ లాక్ పోస్టర్ తో హడావుడి చేస్తే చాలు సినిమా సూపర్ హిట్ అయినా సరే ఆశ్చర్యం లేదు. విమర్శలు వస్తే ఏమవుతుంది చెప్పండి. సినిమాకు కలిసి వస్తుంది కదా అంటున్నారు దర్శక నిర్మాతలు. ఈ మధ్య వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. గతంలో అయితే కొందరు హీరోయిన్లు, మేము అలా చేయలేము అని మొహం మీదే చెప్పేసే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటం లేదు. తమకు పేరు వస్తుంది కాబట్టి హీరోయిన్లు కూడా లిప్ లాక్ సీన్స్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 

 

టాలీవుడ్ లో ఉన్న కొత్త హీరోయిన్లు అందరూ, ముద్దు కావాలా మేము పెట్టేస్తాం అంటున్నారు. ఎక్కడో ఒకరిద్దరు హీరోయిన్లు మినహా టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్లు ముద్దు సీన్స్ కి మక్కువ చూపిస్తున్నారు. దీనితో స్టార్ హీరోల సినిమాల్లో  దర్శకులు వీటిని ఉంచకపోయినా, ఒక మాదిరి హీరోల సినిమాల్లో వీటిని ఉంచాలని భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ, శర్వానంద్, నానీ సహా కొందరి హీరోల సినిమాల్లో వీటికి ఆసక్తి చూపిస్తున్నారు. హీరోయిన్లు రష్మిక మంధనా, పూజ హెగ్డే కూడా ముద్దు సీన్ కి ఓకే చెప్పినట్టు సమాచారం. దీనితో భవిష్యత్తు లో కిస్ హవా పెరగడం దాదాపుగా ఖాయంగా కనపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: