టాలీవుడ్ స్టార్ హీరోగా ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్. నీడ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన మహేష్ రాజకుమారుడు సినిమాతో హీరోగా సర్ ప్రైజ్ చేశాడు. అప్పటినుండి ఘట్టమనేని ఫ్యాన్స్ ను సినిమా సినిమాకు ఉత్సాహపరుస్తూ వస్తున్నాడు మన సూపర్ స్టార్. ఒక స్టార్ హీరో కొడుకు మరో స్టార్ హీరో అవడం చాలా ఈజీ అనుకుంటారు. కాని దాని వెనుక ఉన్న కష్టం గురించి ఎవరు ఆలోచించరు.  

 

కృష్ణ గారి వారసుడిగా మహేష్ మొదటి సినిమా నుండి తన సత్తా చాటుతూ వచ్చారు. మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే కొత్త రికార్డులు సృష్టితాడని ఫిక్స్ అవుతారు ఆడియెన్స్. అంతేకాదు ఓవర్సీస్ లో తెలుగు సినిమాకు ఈ రేంజ్ తీసుకురావడంతో మహేష్ సినిమాల పాత్ర చాలా ఉందని చెప్పొచ్చు. అక్కడ మిలియన్ మార్క్ అందుకున్న మొదటి తెలుగు హీరో మహేష్ మాత్రమే. తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మహేష్ సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు.

 

కృష్ణలోని తెగింపు కూడా మహేష్ కు వచ్చిందని చెప్పొచ్చు. అప్పట్లో ప్రయోగాలు చేయాలంటే కృష్ణ పేరు వినపడేది ఇప్పుడు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ మహేష్ కూడా సినిమా సినిమాకు ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు. కేవలం సినిమాల పరంగా కాకుండా సోషల్ గా కూడా మహేష్ చాలా మంచి పనులు చేస్తున్నాడు. తెలుగు రెండు రాష్ట్రాల్లో రెండు గ్రామాలను దత్తత తీసుకోవడమే కాకుండా గుండె సంబందిత వ్యాధితో బాధపడుతున్న వారికి సహాయంగా తన సంపాదనలో కొంత భాగాన్ని కేటాయిస్తున్నారు. ఈమధ్య ఫుల్ ఫామ్ లో ఉన్న మహేష్ హ్యాట్రిక్ హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. బాలీవుడ్ ఆఫర్లు వచ్చినా తెలుగులోనే ఇంకా తానూ చేయాల్సిన అద్భుతాలు చాలా ఉన్నాయంటూ చెప్పుకొచ్చే మహేష్, మూడు అక్షరాల సంచలనం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.        

మరింత సమాచారం తెలుసుకోండి: