మూడు పదుల వయసు దాటినా సరే టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సినిమాలు ఆచితూచి చేస్తున్నా ఆమె మాత్రం మంచి సినిమాలే చేస్తుంది. ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో ఆమె నటిస్తుంది. అవి కూడా స్టార్ హీరోలతోనే చేస్తుంది. మరో రెండు సినిమాలను లైన్లో పెట్టింది. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పినా సరే ఆమె నో అని చెప్పేసింది. ప్రస్తుతం సినిమాల్లో బిజీ గా ఉన్న అని ఇప్పుడు సినిమాలు మాత్రమే చేస్తా అని చెప్పింది. దీనితో ఆమె కుటుంబ సభ్యులు కూడా పెద్దగా ఒత్తిడి చేయడం లేదు. 

 

ఇక ఇదిలా ఉంటే కాజల్ స్టైల్ కాస్త భిన్నంగా ఉంటుంది. అందరు హీరోలను బుట్టలో వేసుకోవడం ఆమెకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. నందమూరి, మెగా, అక్కినేని, ఘట్టమనేని, దగ్గుబాటి, అల్లు, ఇలా అందరితో సినిమాలు చేసింది. ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ లో ఎవరూ ఈ విధంగా ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈమె మరో యువ హీరో ని కూడా బుట్టలో వేసుకోవాలని చూస్తుంది. విజయ్ దేవరకొండతో ఒక సినిమాను ప్లాన్ చేస్తుంది ఈ ముదురు హీరోయిన్. 

 

ఇక ఆ తర్వాత మరో హీరో ని కూడా లైన్లో పెడుతున్నట్టు సమాచారం. త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే సినిమా లో ఈమె  నటించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అలాగే చిరంజీవి పక్కన ఒక సినిమా చెయ్యాలని చూస్తుంది. తాను మాత్రమే ప్రస్తుతం టాలీవుడ్ లో చిరంజీవి పక్కన సరిపోతా అని చెప్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ప్రభాస్ తో కూడా మళ్ళీ సినిమా కోసం ట్రై చేస్తున్నట్టు సమాచారం. ఇలా అందరు హీరోయిన్లను ఏదోక రకంగా బుట్టలో వేసుకుంటూ వరుసగా ఆఫర్లు కొట్టేస్తుంది ఈ ముదురు భామ. ఇంకెన్నాళ్ళు సినిమా పరిశ్రమలో ఉంటుందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: