మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణలో చాలా బిజీగా ఉన్నాడు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం దాదాపు పది భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా జనవరి ఎనిమిదవ తేదీన విడుదల అవుతుందని ప్రకటించారు. అప్పటి వరకు చరణ్ మరో సినిమాలో నటించడానికి వీలు లేకుండా రాజమౌళి లాక్ చేసేశాడు. అయితే రామ్ చరణ్ తన తర్వాతి సినిమా ఏంటనే విషయం ఇప్పుడే ఆలోచించట్లేదు.

 

 

కానీ నిర్మాతగా సినిమాలు నిర్మించేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు. ఇప్పటి వరకు రామ్ చరణ్ రెండు చిత్రాల్ని నిర్మించాడు. ఇప్పుడు మరో చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. మళయాలంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ చిత్రాన్ని చిరంజీవితో రీమేక్ చేయడానికని ఆ సినిమా హక్కులని మంచి ధరకి కొన్నాడు.  ఆ సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో.. దాన్ని ఎవ‌రు తెర‌కెక్కిస్తారో తెలియ‌దు. మ‌ధ్య‌లో సుకుమార్ పేరు వినిపించింది కానీ.. అలాంటి ద‌ర్శ‌కుడు రీమేక్ తీస్తాడా అన్న సందేహాలు నెల‌కొన్నాయి.

 

 

 

అస‌లు లూసిఫ‌ర్ లాంటి రొటీన్ సినిమా, పైగా తెలుగులోకి కూడా అనువాద‌మైన చిత్రాన్ని మ‌ళ్లీ రీమేక్ చేయ‌డం క‌రెక్ట్ కాద‌న్న అభిప్రాయం ఉంది. ఐతే ఈ సినిమా సంగ‌తి తేల‌కుండానే రామ్ చ‌ర‌ణ్.. రీమేక్ కోసం మ‌రో మ‌ల‌యాళ సినిమాపై  కన్నేశాడని వార్తలు వస్తున్నాయి. లూసిఫర్ సినిమాని డైరెక్ట్ చేసిన పృథ్వీరాజ్ హీరోగా నటించిన డ్రైవింగ్ లైసెన్స్ అనే మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి రామ్ చరణ్ ఆసక్తి చూపిస్తున్నాడట.

 

 

ఈ సినిమాని రీమేక్ చేయడానికి కారణం ఏంటో ఎవ్వరికీ తెలియట్లేదు. నిర్మాతగా చిరంజీవితో మాత్రమే సినిమాలు తీసే రామ్ చరణ్..ఈ సినిమాని కూడా చిరంజీవితోనే తీయడానికి చూస్తున్నాడా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇంత సడెన్ గా రామ్ చరణ్ కి మళయాల సినిమాల మీద ఇంత ఆసక్తి ఎందుకో...

మరింత సమాచారం తెలుసుకోండి: