తన తండ్రికి ఎంత స్టార్ ఇమేజ్ ఉన్నా సరే తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా ఆర్ఆర్ఆర్ అనే సినిమా లో రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్టు తెలుస్తుంది. 

 

త్వరలో రామ్ చరణ్ పాత్ర కూడా షూటింగ్ పూర్తి చేసుకుంటే మరో సినిమా మీద దృష్టి పెట్టే ఆలోచన లో ఉన్నాడు చెర్రీ. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్న ఈ మెగా హీరో... నిర్మాత గా కూడా తన సత్తా చాటే పనిలో ఉన్నాడు. ఇప్పటికే లూసిఫర్ అనే సినిమాను చేస్తున్న ఈ హీరో మరో సినిమా మీద కూడా దృష్టి పెట్టినట్టు టాలివుడ్ వర్గాలు అంటున్నాయి. ఒక మళయాళ సినిమా కు సంబంధించిన హక్కులను కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్‌ అనే సినిమాను మెగా హీరోలతో చెయ్యాలని భావిస్తున్నాడు. 

 

దీనికి సంబంధించి తెలుగు దర్శకుడి తో కూడా రామ్ చరణ్ మాట్లాడినట్టు సమాచారం. త్వరలోనే ఒక ప్రముఖ దర్శకుడి తో ఈ సినిమా ను తెలుగులో రీమేక్ చేసే ప్లాన్ చేస్తున్నాడు. చిరంజీవి 153వ సినిమాగా మలయాళంలో సూపర్ హిట్ట‌యిన లూసిఫ‌ర్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే ఆ సినిమా ను తెరకెక్కించే యోచన లో ఉన్నారు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు గా పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: