సాధారణంగా ఒక అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు రాకూడని టైం లో వస్తేనే ఇంట్లో వాళ్ళు ఒద్దంటారు అంటారు. ఇక వేరే ఊరు వెళతామంటే ససేమిరా అంటారు. అలాంటి మొహానికి రంగేసుకొని రంగుల ప్రపంచంలోకి వేళతామంటే, మోడల్ గా రాణిస్తామంటే ఏ తల్లిదండ్రులు ఊరుకుంటారు చెప్పండి. మన సౌత్ లో హీరోయిన్స్ కూడా 100 90 శాతం సినిమాల్లోకి వెళతామంటే ముందు ఒద్దన్నారు చాలా రోజులు కన్వీన్స్ చేస్తే ఒప్పుకున్నారని చాలా సందర్భాలలో చెపితే విన్నాము కూడా. నిజమే ఇక్కడ సక్సస్ కావాలంటే చాలా కష్టం. ఏ డిగ్రీనో కంప్లీట్ చేసి నాలుగు పదుల జీతం సంపాదించుకుంటూ కుదురుగా ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు లక్షల్లో ఉన్నారు.

 

ఆ లక్షల్లో ఏ పది, ఇరవై మందికే సినిమా హీరోయిన్ అవ్వాలన్న ఆసక్తి ఉంటుంది. కానీ అది అంత ఈజీ కాదని అందరీకీ తెలిసిందే. ఇక్కడ అంతా మాయగా ఉంటుంది. సక్సస్ ఎప్పుడొస్తుందో తెలీసు. ఎప్పుడు పోతుందో తెలీదు. నిలకడ లేని జీతం జీవితం. పైగా ఒక్కసారి మేకప్ వేసుకున్నారంటే ప్రతీ రోజు ఏదో ఒక వార్తలు ఏవో ఒక రూమర్స్ వస్తూనే ఉంటాయి. హీరోయిన్స్ కి ఏవరో ఒకరితో లింక్ పెడుతూ ఇష్టమొచ్చినట్టు రాసేస్తుంటారు. అవన్ని భరిస్తూ ఉండాలి. మనకి తెలీకుండానే మన గురించి లేనిపోనివన్ని రాస్తున్న వారించలేని పరిస్థితి నెలకొంటుంది. మాట్లాడితే ఒక రూమర్, మాట్లాడకపోతే ఒక రూమర్ స్ప్రెడ్ చేసేస్తారు.

 

ఇదే విషయం చాలామంది హీరోయిన్స్ బాధపడుతుంటారు. అయితే దాదాపు అందరు హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీకొచ్చే ముందు వీటన్నిటికి సిద్దపడే వస్తారు. అయితే హీరో హీరోయిన్స్ కి రెగ్యులర్ గా ఎదురయ్యో ప్రశ్న ..రెమ్యూనరేషన్ గురించి. హీరోల మాట అలా ఉంచితే ఎక్కువగా హీరోయిన్స్ మీదే చాలా మంది ఏడుస్తుంటారు. లక్షల్లో రెమ్యూనరేషన్ సంపాదించడమే కాకుండా ఈవెంట్స్ ద్వారా కూడా లక్షలు పోగేస్తుంటారని.

 

అయితే ఇలా లక్షలు ఇస్తున్నారు కాబట్టే సినిమాకొసం కొన్ని సార్లు సీన్స్ బాగా రావాలంటే చాలా అవస్థలు పడతామని, బాహుబలి లాంటి సినిమాకి హీరో, హీరోయిన్ అన్న తేడా లేకుండా అందరికీ ఒళ్ళు హూనం అయిపోతుందని చెబుతుంటారు. ఇలాంటి అవస్థలని, వాటితో పాటు కొన్ని సార్లు సినిమాలు ఫ్లాపయితే ఆ నిందలు హీరోయిన్స్ మీద వేస్తే వాటిని భరిస్తుంటాము కాబట్టే మాకు లక్షల్లో రెమ్యూనరేషన్ ఇస్తుంటారని వాపోతుంటారు మన స్టార్ హీరోయిన్స్.   

మరింత సమాచారం తెలుసుకోండి: