ఓవైపు హాట్ హీరోయిన్ ఇమేజ్ సంపాదిస్తునే మరోవైపు వైవిధ్యత్మకమైన పాత్రలు ఎంచుకుంటూ తనలోని నటిని కూడా అందరికీ నిరూపించింది అమలాపాల్. ఏ హీరోయిన్ ధైర్యం చేయలేని.. ఛాలెంజింగ్  పాత్రలను చేస్తుంది అమలాపాల్. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న న్యూడ్ గా కూడా నటించింది. ఇకపోతే హీరోయిన్ అమలా పాల్ ఆమె భర్త విజయ్  మధ్య విడాకులు జరిగి ఎన్నో రోజులు అవుతున్నప్పటికీ... ఇప్పటికీ ఈ అంశం మీడియాలో నానుతూనే ఉంది. ఇక తాజాగా అమలాపాల్ విడాకుల అంశం మరోసారి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు కారణం అమలాపాల్ భర్త విజయ్ తండ్రి చేసిన వ్యాఖ్యలు. తన కొడుకుతో అమలాపాల్ విడాకులు తీసుకోవడం వెనుక తమిళ  హీరో ఉన్నాడు అంటూ విజయ్ తండ్రి  చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. 

 

 

 తమిళ హీరో ధనుష్ వల్లే తన కొడుకు అమలాపాల్ విడాకులు తీసుకున్నారు అంటూ విజయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా వదిలేయాలి అనుకున్న అమలాపాల్ ను... ధనుష్ మళ్లీ సినిమాల్లో నటింపచేయడం వల్లే వారిద్దరి మధ్య గొడవలు వచ్చి ఆ గొడవలు విడాకుల వరకు దారి తీసాయి అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక అమలాపాల్ భర్త తండ్రి వ్యాఖ్యలతో ప్రస్తుతం అమలాపాల్ విడాకులు అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ అంశాన్ని హీరో ధనుష్ అమలాపాల్ దృష్టికి తీసుకువెళ్లేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు. కాగా ప్రస్తుతం ధనుష్ అందుబాటులోకి రాలేదు. కానీ అమలా పాల్ ను ఇదే విషయమై స్పందించాల్సి కోరారు మీడియా ప్రతినిధులు. 

 

 

 ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అమలాపాల్. విడాకులకు హీరో ధనుష్ కారణమంటూ విజయ్ తండ్రి  చేసిన వ్యాఖ్యల పై మీ స్పందన ఏమిటి అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు... కాస్త చిర్రుబుర్రు లాడింది అమలాపాల్. ఎప్పుడో జరిగి పోయిన విషయం గురించి ఇప్పుడు మళ్లీ ఎందుకు మాట్లాదించాలని  చూస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. తన భర్తకు తనకు మధ్య విడాకులు జరగడానికి ఎవరూ కారణం కాదని.. అమలాపాల్ తెలిపింది.మా ఇద్దరి  కారణంగానే మేము  విడిపోయినట్టు చెప్పుకొచ్చింది. భార్య భర్తలు ఎవరి కారణంగానో విడిపోరు అంటూ చెప్పిన అమలాపాల్... రెండవ పెళ్లి గురించి ప్రస్తావించగా.. అలాంటి ఆలోచన లేదని చెప్పింది. చేసుకోవాలి అనిపించినప్పుడు తప్పక చెబుతానని.. అమలాపాల్ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: