తెలుగు సినీ పరిశ్రమ లో చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక సాదా సీదా నటుడి గా టాలీవుడ్ లో అడుగుపెట్టి ఆ తర్వాత అగ్ర హీరోగా అక్కడి నుంచి మెగాస్టార్ గా ఆయన ఎదిగిన తీరు ఇప్పటికే ఆదర్శమే. ఆయనకు ఒక్క తెలుగు సినీ పరిశ్రమ లోనే కాదు హిందీ, తమిళం, కన్నడ చిత్ర సీమల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇక తమిళ, కన్నడనాట ఆయన సినిమాలకు మంచి ఆదరణ ఉండేది. అక్కడి స్టార్ హీరోలు కూడా చిరంజీవి తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించే వారు. 

 

ఇక చిరంజీవి, తమిళ సూపర్ స్టార్  ర‌జ‌నీకాంత్‌ మధ్య ఉన్న అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకానొక దశలో చిరంజీవి రాజకీయాల్లోకి రావడానికి రజనీ కాంత్ ఇచ్చిన ప్రేరణే కారణమని చెప్తూ ఉంటారు. ఇక సినీ పరిశ్రమలో కూడా ఒకరితో ఒకరికి మంచి అనుబంధం కూడా ఉంది. ముఖ్యంగా ర‌జ‌నీకాంత్‌ తీసే ప్రతీ సినిమాను చిరంజీవి గమనించే వారు. అటు ర‌జ‌నీకాంత్‌ కూడా చిరంజీవి సినిమాల మీద ఆసక్తి చూపించే వారు. ఈ నేపధ్యంలోనే తన సినిమాల్లో ఒక సినిమాను ర‌జ‌నీకాంత్‌ హీరోగా చిరంజీవి నిర్మించారు. 

 

రజినీ కాంత్ కథానాయకుడుగా గీతా ఆర్ట్స్ బ్యానరు పై మాప్పిళ్ళై చిత్రాన్ని నిర్మించాడు. దీనికి అత్తకి యముడు అమ్మాయికి మొగుడు రీమేక్. ఇందులో చిరు అతిథి పాత్రలో కనిపిస్తారు. ఇక ఆ సినిమా తెలుగులో ఏ స్థాయిలో విజయవంతం అయిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాలో చిరంజీవి నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత చిరంజీవి స్థాయి కూడా పెరిగిపోయింది అంటూ ఉంటారు. ముఖ్యంగా పవర్ ఫుల్ డైలాగ్స్ కి అభిమానులు ఊగిపోయారు. ఈ సినిమా తమిళంలో కూడా మంచి హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: