చిరంజీవి సినిమాలు అనగానే అభిమానులకు కళ్ళ ముందు ఉండేవి, యాక్షన్ సీన్స్, డైలాగ్స్, డాన్స్, కామెడి. ఇవి అన్నీ కూడా చిరంజీవి దేనికి లోటు చేయకుండా నటిస్తూ ఉంటారు. ఆయన సినిమాల్లో కామెడి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కమెడియన్స్ ఉన్నా సరే చిరంజీవి తనకు తానుగా కామెడి చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. చిరంజీవి నటనలో కామెడి ఎప్పుడు హైలెట్ గానే ఉంటుంది. ఎలాంటి సన్నివేశంలో అయినా సరే ఆయన కామెడి చేయగలరు. 

 

దానికి తోడు ఆ సంభాషణల్లో చిరు మాట్లాడే మాటలు ఎంతో ఆకట్టుకుంటాయి. యముడికి మొగుడు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, అన్నయ్య, ముగ్గురు మొనగాళ్ళు, జై చిరంజీవ, అందరి వాడు, శంకర్ దాదా ఎంబీబిఎస్, గ్యాంగ్ లీడర్, రిక్షా వాలా, శంకర్ దాదా జిందాబాద్ సినిమాల్లో చిరంజీవి కామెడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇలా చాలా సినిమాల్లో ఆయన కమెడియన్స్ తో పని లేకుండా కామెడి చేసారు. ఆ స్థాయిలో ఇప్పటి వరకు ఏ హీరో కూడా కామెడి చేయలేకపోయారు. 

 

కథ డిమాండ్ చేసినా, తన పాత్ర డిమాండ్ చేసినా సరే తన హీరో ఇమేజ్ ని పక్కన పెట్టి చిరంజీవి కామెడి చేయడానికి వెనుకాడరు. చాలా మంది హీరోలు తమకు ఉన్న స్టార్ ఇమేజ్ తో కామెడి చేయలేరు. మరి కొంత మందికి కామెడి సెట్ అవ్వదు. కాని చిరంజీవికి మాత్రం అలాంటి సమస్య ఎక్కడా లేదనే చెప్పాలి. ఇలా చిరంజీవి చాలా సినిమాల్లో హాస్యంతో అభిమానులను అలరించారు. ఆయన కామెడి ఇప్పటికి యుట్యూబ్ లో హల్చల్ చేస్తూనే ఉంటుంది. కట్ చేసి వీడియో లు అప్లోడ్ చేస్తూ ఉంటారు. అవి అన్ని కూడా లక్షల కొద్దీ వ్యూస్ సాధించి ఎవర్ గ్రీన్ గా నిలుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: