చిరంజీవి గా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర వరప్రసాద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. తెలుగు సినీ ప్రేక్షకులను అలరించడానికే జన్మించిన మెగాస్టార్.. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా, స్వయం కృషితో ఎదిగి వచ్చాడు. ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ నేప‌థ్యంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజుగా నిలాచ‌రు చిరంజీవి. అయితే చిరంజీవి కెరీర్ ఒక్కో సినిమా ఒక్కోలా మలుపు తిప్పింది. అందులో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కూడా ఒక‌టి అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు.

 

 1990లో కె. రాఘవేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యాన‌ర్‌పై చ‌ల‌సాని అశ్వ‌నీద‌త్ నిర్మించారు. ఈ చిత్రంలో చిరంజీవి స‌ర‌స‌న  శ్రీదేవి హీరోయిన్ గా న‌టించింది. జగదేక వీరుడు అతిలోక సుందరి' చిరంజీవి కెరీర్ లో ఓ ఆణిముత్యం లాంటి సినిమా. ఈ సినిమాలో శ్రీదేవి ఇంద్రజగా ప్రేక్షకులను మెప్పించిన తీరు అజరామరం. తెలుగు సినీ చరిత్రలో ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఈ సినిమా విడుద‌లైన‌ టైమ్‌లో మూడు నెల‌ల పాటు జోరు వ‌ర్షాలు కురిసాయి. దీంతో రాష్ట్రాన్ని మొత్తం వరదలు అతలాకుతలం చేశాయి. 

 

అయితే ఇలా ప్రకృతి వైపరిత్యంలో రాష్ట్రంలో ముఖ్య భాగం వరదలలో ఉండగా రిలీజ్ అయిన ఈ సినిమా అప్పటివరకు ఉన్న అన్ని సినిమాల రికార్డ్స్ ని బద్దలుకొట్టి చరిత్రని తిరగ రాసింది. ఈ సినిమా కి చిరంజీవి శ్రిదేవి జంట అద్భుతంగా కుదరడం , కథ, సెట్స్, పాటలు, నటీనటుల అభినయనం అన్ని కలిసి ఈ సినిమాను సూపర్ దుపెర్ హిట్ చేసాయి. చాల థియేటర్లు లో 100 రోజులు ఆడిన ఈ సినిమా ఒక థియేటర్ లో 200 రోజులు పూర్తి చేసింది కూడా. 10 కోట్ల కలెక్షన్స్ తో సిన రికార్డు బుక్స్ ని తిరగరాసిన సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి.
  
 

మరింత సమాచారం తెలుసుకోండి: