శివశంకర వరప్రసాద్... ఒక సాదాసీదా మనిషి అయినా వ్యక్తి. తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన తర్వాత ఒక శక్తిగా మారారు. పునాదిరాళ్లు సినిమాతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శివశంకర వరప్రసాద్... మొదటి సినిమాతో చిరంజీవి హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే నటనపై తనకున్న ఆసక్తిని.. తనలోని ప్రతిభను... చూసి దర్శకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇక ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను దక్కించుకున్నారు  చిరంజీవి. ఇక ఆ తర్వాత క్రమక్రమంగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇక ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు నిలువుటద్దంల చిరంజీవి మారిపోయారు. 

 

 అయితే చిరంజీవి... మెగాస్టార్ చిరంజీవిగా  మారడానికి ఎంతో అలుపెరగని కష్టం... ఎన్నో విజయాలు కారణం. ఎన్నో సినిమాలతో సంచలన రికార్డు సృష్టించారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఆయన రికార్డులను ఆయనే  తిరగరాశారు కూడా.  తెలుగు చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ ని షేక్ చేసిన రికార్డులను సైతం చిరంజీవి సృష్టించారు. అయితే చిరంజీవి 150 సినిమాలు చేసినప్పటికీ చిరంజీవి కెరీర్ లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమా ఏది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే సినిమా ఖైదీ.  చిరంజీవి కెరియర్ ను  కీలక మలుపులు తిప్పటమే  కాదు తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ ను సృష్టించింది ఈ సినిమా . తెలుగు చిత్రపరిశ్రమ మొత్తం చిరంజీవి వైపు చూసేలా చేసింది ఖైదీ సినిమా. 

 


 ఈ సినిమాలో ఖైదీ పాత్రలో నటించిన చిరంజీవి తన అద్భుతమైన నటనతో.. తెలుగు ప్రేక్షకులందరికీ గుండెల్లో స్థానం సంపాదించారు.. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి చేసిన నాగిని డాన్స్ ఇప్పటికీ ఎవర్గ్రీన్ గా నిలుస్తూ ఉంటుంది. కాగా ఈ సినిమా తెలుగు చిత్ర సీమలో .. చిరంజీవి విజయవంతమైన ప్రస్థానానికి  కారణమైంది. అయితే చిరంజీవి 150 సినిమాల్లో ఎన్నో సంచలన విజయాలు ఉన్నప్పటికీ.. చిరంజీవి కెరీర్ లో మొట్టమొదటి ట్రెండ్ సెటర్ సినిమా  మాత్రం ఖైదీ అనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: