మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు టాలీవుడ్ లో ఒక హీరో పేరు అని చెప్పడం కంటే.. ఒక ట్రెండ్ సెట్టర్.. ఒక ఇన్స్పిరేషన్.. ఒక మోటివేషన్.. ఒక కాలిక్యులేషన్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పదాలతో వర్ణించిన చిరంజీవి గొప్పతనం గురించి చెప్పడం తక్కువే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక సాదా సీదా కుటుంబంలో జన్మించిన శివశంకర వరప్రసాద్.. తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి.. తన ప్రస్థానాన్ని అద్భుతం గా మార్చుకున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ అంటే మొదటగా చిరంజీవి పేరు గుర్తుకు వచ్చేలా మారిపోయారు. తెలుగు చిత్ర పరిశ్రమ అంటే చిరంజీవి... చిరంజీవి అంటే తెలుగు చిత్ర పరిశ్రమ అనేంతలా  ప్రభావితం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో.. మెగాస్టార్ చిరంజీవి కొన్ని పేజీలను మాత్రమే కాదు.. ఒక పుస్తకాన్ని లిఖించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. 

 

 

 ఒక వ్యక్తి గా వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప శక్తిగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. అంచలంచలుగా ఆయన ఎదిగిన తీరు ప్రతి హీరోకి కాదు.. సగటు మనిషికి కూడా ఆదర్శమే. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అంటూ నిరూపించారు మెగాస్టార్ చిరంజీవి. అయితే చిరంజీవి ఫిలిం ఇనిస్టిట్యూట్లో నటనలో తీసుకుంటున్న సమయంలో.. అవకాశాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న  క్రమంలో.. చిరంజీవికి మొదటి అవకాశం ఎలా వచ్చింది అంటే.. మెగాస్టార్ చిరంజీవి మొదటగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సినిమా పునాదిరాళ్లు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మరో నలుగురు హీరోలు కూడా ఉంటారు. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ కి బదులు కమెడియన్ సుధాకర్ హీరో గా సెలక్ట్ అయ్యారు. 

 

 ఈ చిత్రాన్ని దర్శకుడు గూడపాటి రాజ్ కుమార్ తెరకెక్కించారు అయితే పునాది రాళ్లు సినిమా అనుకుంటున్న సమయంలోనే.. ఐదుగురు హీరోలలో ఒకరిగా సెలెక్ట్ అయిన సుధాకర్ ప్రముఖ దర్శకుడు భారతీరాజా దర్శకత్వంలో తమిళంలో ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ పరిస్థితుల్లో పునాదిరాళ్లు సినిమాలో నటించలేనని సుధాకర్ దర్శకుడు రాజ్ కుమార్ కి చెప్పాడు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న చిరంజీవిని నువ్వు కూడా చూడ్డానికి బాగానే ఉన్నావ్  నువ్వు నటిస్తావా అని రాజ్ కుమార్ చిరంజీవి అడిగారు. దీంతో చిరంజీవి సుధాకర్ వైపు ప్రశ్నార్థకంగా చూడగా.. నటించు అని సుధాకర్ కను సైగ చేయడంతో.. చిరంజీవి పునాదిరాళ్లు సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు. ఇక ఆ తర్వాత తన నటనలో మెళుకువలు అన్నింటినీ చూపించి వరుస  సినిమా అవకాశాలు దక్కించుకుని అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా ప్రేక్షకుల ముందు ఉండి ఇంకా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: