చాలా మంది ఇళ్ళ‌ల్లో తల్లికి అన్ని విష‌యాల్లో తోడుగా ఉంటూ చేదోడు వాదోడుగా ఉండి ఇంటి ప‌నుల్లో స‌హాయం చేసేది ఎక్కువ‌గా కూతుర్లే. అలాంటి త‌ల్లి కూతుర్ల మధ్య కూడా కొన్ని సంద‌ర్భాల్లో ఇగోలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే...మ‌నం పిల్ల‌ల‌ను పెంచే పెంప‌కం బ‌ట్టే ఉంటుంది. మ‌న పెంప‌కం వ‌ల్లే పిల్ల‌లు అలా త‌యార‌వుతారు. త‌ల్లి ఏం చెప్పినా త‌న మంచికే అని ఆలోచించేలా పెంచాలి త‌ప్ప పంతానికి పోయేలా ఎప్పుడూ పెంచ‌కూడ‌దు. అలాగే ఇంట్లో ఎప్పుడూ పిల్ల‌ల మాట‌కు విలువిచ్చేలా ఏ ఇంట్లోను నిర్ణ‌యాలు ఉండ‌కూడ‌దు. కొన్ని విష‌యాల్లో ఇచ్చినా కొన్ని విష‌యాల్లో త‌ల్లిదండ్రుల‌కంటే ఎవ్వ‌రూ బాగా ఆలోచించ‌లేర‌నేలా పిల్ల‌ల‌ను పెంచాలి. 

 

అలాగే ఏ విష‌యంలోనైనా ఇద్ద‌రూ పంతానికి పోకూడ‌దు. ఇద్ద‌రూ ఇగోలు చూపించ‌కూడ‌దు. త‌ల్లి అన్న ప్రేమ బిడ్డ‌లో ఉండాలి. కూతురు అన్న ప్రేమ ఆ త‌ల్లిలోనూ ఉండాలి. ఎప్పుడైనా స‌రే పంతాలు వ‌దిలితేనే బంధాలు నిలుస్తాయి. ఉదాహ‌ర‌ణ మారుతి తెర‌కెక్కించిన చిత్రం శైల‌జారెడ్డి అల్లుడులో ర‌మ్య‌కృష్ణ త‌ల్లి పాత్ర‌లో న‌టిస్తే అనుఇమాన్యుల్ కూతురి పాత్ర‌లో న‌టిస్తుంది. అందులో ఇద్ద‌రికీ ఒక‌రిపై ఒక‌రికి అమిత‌మైన ప్రేమ ఉన్నా పైకి మాత్రం చాల పంతంతో ఉంటారు. అలా ఉండ‌కూడ‌దు. 

 

వ‌రుస విజ‌యాల‌తో సూప‌ర్ ఫాంలో ఉన్న యువ ద‌ర్శ‌కుడు మారుతి, అక్కినేని యంగ్ హీరో నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సినిమా శైలజా రెడ్డి అల్లుడు.  ఒక‌ప్పుడు టాలీవుడ్లో సూప‌ర్ హిట్ అయిన అత్త సెంటిమెంట్‌ను మ‌రోసారి రిపీట్ చేస్తూ తెర‌కెక్కించిన ఈ సినిమాలో అత్త పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టించారు. ఇను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్. చిన బాబు సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్ పతాకంపై నిర్మించారు. ఈ మ‌ధ్య వ‌చ్చిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌లో అది కూడా ఓ మంచి చిత్ర‌మ‌నే చెప్పాలి. ద‌ర్శ‌కుడు ఈ చిత్రంలో పంతాలు వ‌దిలితే బంధాలు ఎలా ఉంటాయి అన్న విష‌యం పై చూపించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: