హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ వైపు వెళ్లారంటే వాళ్ల కెరీర్ క్లైమాక్స్ కు చేరినట్టే. హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ లోకి వెళ్తే ఆటోమెటిక్ గా వాళ్ల గ్రాఫ్ డౌన్ అవుతుంటుంది. అందుకే చాలామంది హీరోయిన్లు కమర్షియల్ రోల్స్ లోనే కనిపిస్తుంటారు. కానీ కంగన రనౌత్ మాత్రం ఈ ఫార్మాట్ కు ఎదురు వెళ్తోంది. వరుసగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోనే నటిస్తోంది. 


కంగనా రనౌత్ కమర్షియల్ హీరోయిన్ క్యారక్టర్ ప్లే చేసి ఏడేళ్లు దాటుతోంది. క్వీన్ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లోకి వచ్చిన కంగన, ఇప్పటి వరకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో నటించలేదు. తలైవి, ధాక్కడ్, తేజస్ ఇలా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో కనిపిస్తోంది. మరి కంగన వరుసగా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ లోనే ఎందుకు నటిస్తోంది అంటే చాలా కారణాలు చెబుతున్నారు బాలీవుడ్ జనాలు. 

 

కంగన రనౌత్ బాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్ ఉంది. ఈమె పక్కన నిల్చున్నా చాలు కాంట్రవర్సీల్లో పడిపోతామని ముంబయి జనాలంతా భయపడుతుంటారు. హృతిక్ రోషన్ ఈ మెయిల్ ఇష్యూ తర్వాత చాలామంది హీరోలు, కంగనాని గ్రహాంతర వాసిలా చూస్తున్నారు. దీంతో కంగనకు కమర్షియల్ సినిమాలు రావడమే గగనమైపోతోంది. 

 

కంగనా రనౌతే పెద్ద గ్యాస్ బాంబ్ అనుకుంటే ఆమె చెల్లెలు రంగోళి చండల్ మరీ ఓవర్ యాక్షన్ క్యాండిడేట్. అక్క బాలీవుడ్ లో ఉంది కాబట్టి, నాకు ఇండస్ట్రీ మొత్తాన్ని తిట్టే హక్కు ఉంది అని ఫీలవుతుంది. హీరోల నుంచి మొదలుపెడితే లైట్ బాయ్ వరకు అందరిపైనా నెగిటివ్ పోస్టులు పెడుతుంది. ఈ ఎఫెక్ట్ తో క్రిష్ లాంటి డైరెక్టర్స్ చాలామంది కంగన ఫ్రీగా కాల్షీట్స్ ఇస్తా అన్నాసరే దండం పెట్టేస్తున్నారు. స్టార్ హీరోలు, డైరెక్టర్లే కాదు కేవలం సినిమాలపైనే ఫోకస్ పెట్టే వాళ్లంతా కంగనకు దూరంగా ఉంటున్నారు. అందుకే కెరీర్ బండిని లాక్కురావడానికి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో పడిపోయింది కంగన. 

మరింత సమాచారం తెలుసుకోండి: